మా పాపకు జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?

మా పాప వయసు ఎనిమిదేళ్లు. తన చదువు గురించి మేము చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. కానీ రాత్రి చదివించిన పాఠాలు మరుసటి రోజు అడిగితే గుర్తు లేదంటోంది. పరీక్షల్లో కూడా సరిగా రాయలేకపోతోంది.

Published : 16 Feb 2024 12:57 IST

మా పాప వయసు ఎనిమిదేళ్లు. తన చదువు గురించి మేము చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. కానీ రాత్రి చదివించిన పాఠాలు మరుసటి రోజు అడిగితే గుర్తు లేదంటోంది. పరీక్షల్లో కూడా సరిగా రాయలేకపోతోంది. మా పాపకు మతిమరుపు సమస్య ఉందా? తనకు జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ పాప రాత్రి చదివిన విషయాలను మరునాడు అడిగితే మర్చిపోతోందని చెబుతున్నారు. సాధారణంగా బాగా చదివే విద్యార్థులు చదివిన విషయాలను గుర్తుపెట్టుకోవడానికి వారికంటూ కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తుంటారు. కొంతమంది విషయాలను బట్టీ పడితే, ఇంకొంతమంది విషయాలను కోడ్‌ రూపంలో గుర్తుపెట్టుకుంటారు. మరికొంతమంది అసలు విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ, చాలామంది విద్యార్థులు వారి ప్రతిభ గురించి వారికే తెలియక ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులుగా మీరు వారికి అవగాహన కల్పించాలి. దీనికంటే ముందుగా మీ పాప ప్రతిభపై మీరు ఒక అంచనాకు రావాలి. మొదటగా ఎన్నిసార్లు చదివితే తిరిగి చూడకుండా, తప్పులు లేకుండా రాయగలుగుతోందో తెలుసుకోవాలి. ఆ తర్వాత తను నేర్చుకున్న విషయాలను అవతలి వారికి వివరించగలుగుతోందా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే మీ పాప అన్ని సబ్జెక్టుల్లోనూ ఇలానే మర్చిపోతోందా? అన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. ఒకవేళ కొన్ని సబ్జెక్టుల్లో మాత్రమే ఇలా మర్చిపోతుంటే వాటిపై ఆసక్తి కలగడానికి బొమ్మల రూపంలో పాఠాలు చెప్పడం వంటివి చేయాలి. అలాగే ఏ పద్ధతిలో చెబితే తను విషయాలను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుందో ఆ పద్ధతిలో పాఠాలు చెప్పే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికీ ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం. మీ పాపకు కూడా తనపై తనకు నమ్మకం కలిగేలా చేయండి. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్