వారసుడే కావాలంటున్నారు!

మాది మధ్య తరగతి కుటుంబం. మా వారు, నేను ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మాకు ఆరు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరమ్మాయిలు ఉన్నారు. వాళ్లను మా అత్తమామలే చూసుకుంటారు. ఇక పిల్లలు చాలు ఆపరేషన్‌ చేయించుకుంటానంటే మా అత్తమామలు వద్దంటున్నారు.

Published : 27 Nov 2023 12:56 IST

మాది మధ్య తరగతి కుటుంబం. మా వారు, నేను ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నాం. మాకు ఆరు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరమ్మాయిలు ఉన్నారు. వాళ్లను మా అత్తమామలే చూసుకుంటారు. ఇక పిల్లలు చాలు ఆపరేషన్‌ చేయించుకుంటానంటే మా అత్తమామలు వద్దంటున్నారు. తమకు వారసుడు కావాలని మొండిగా వాదిస్తున్నారు. మావారు తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలున్నారు. అత్తమామల భారం కూడా మాపైనే ఉంది. ఆడ, మగ సమానమని చెబితే వారికి అర్థం కావడం లేదు. వాళ్లకు ఎలా నచ్చజెప్పాలి? దయచేసి సలహా ఇవ్వగలరు? - ఓ సోదరి

జ. చాలామంది కుటుంబాల్లో ఇలాంటి భావన ఉంటుంది. అయితే పిల్లల విషయంలో దంపతులుగా మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ అనుమతి లేకుండా పిల్లల కోసం ప్లాన్‌ చేసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి, దంపతులుగా మీరిద్దరూ ఈ విషయం గురించి స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మరొక బేబీని మీ జీవితంలోకి ఆహ్వానించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? దానివల్ల భవిష్యత్తులో కలిగే లాభనష్టాల గురించి చర్చించండి. మీకు ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలున్నారన్నారు. మూడో బేబీని కనే విషయంలో మీ ఆరోగ్యం సహకరిస్తుందా? అనేది కూడా డాక్టర్‌ వద్ద పరిశీలించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత మీ నిర్ణయాన్ని మీ అత్తమామలకు వ్యక్తపరచండి. అప్పుడు వారు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారి అభిప్రాయం మారకపోతే అందరూ కలిసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ తీసుకుంటే మీ సమస్యకు తప్పకుండా ఓ పరిష్కారం లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్