‘పెళ్లికి ముందు బాయ్‌ఫ్రెండ్స్ లేరా..’ అంటూ వేధిస్తున్నాడు!
మా అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లి చేశాం. అల్లుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం కూడా మంచిదే. కానీ, అతను మంచివాడు కాదు. మా అమ్మాయిని అనుమానిస్తున్నాడు. ‘కాలేజీ రోజుల్లో నీకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఉంటే చెప్పు.. నేనేమీ అనుకోను’ అంటూ విపరీతంగా వేధిస్తున్నాడు....
మా అమ్మాయికి ఈ మధ్యనే పెళ్లి చేశాం. అల్లుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం కూడా మంచిదే. కానీ, అతను మంచివాడు కాదు. మా అమ్మాయిని అనుమానిస్తున్నాడు. ‘కాలేజీ రోజుల్లో నీకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరా? ఉంటే చెప్పు.. నేనేమీ అనుకోను’ అంటూ విపరీతంగా వేధిస్తున్నాడు. అతనికి తన తల్లి, అక్కాచెల్లెళ్లు అంటే కూడా గౌరవం లేదు. వాళ్లతో కూడా చులకనగా మాట్లాడతాడని మా అమ్మాయి చెప్పింది. కౌన్సెలింగ్ ఇప్పిస్తే అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. కౌన్సెలింగ్ ద్వారా తప్పకుండా అతనిలో మార్పు తీసుకురావచ్చు. కొంతమందిలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల వారిలో ఇలాంటి భావన ఏర్పడుతుంటుంది. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చేసే పనులు, ఆలోచనల వల్ల వారిలో మహిళల పట్ల చులకన భావం కలిగేలా చేస్తుంటాయి. తద్వారా పలు విషయాలపై వారికంటూ ఒక ఆలోచనా విధానాన్ని రూపొందించుకుంటారు. దాంతో ‘మహిళలందరూ ఇలానే ఉంటారు. మగవారు ఇలానే ఉండాలి’ అనే అభిప్రాయానికి వస్తారు. కానీ, వారి అభిప్రాయానికి, అసలు నిజానికి మధ్య చాలా అంతరం ఉంటుంది. ఫలితంగా పలు విషయాల్లో వారు ఇంతకు ముందు రూపొందించుకున్న ఆలోచనా విధానం వారిని తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి వారిలో ఏ విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి ప్రవర్తనాపరమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మంచి మార్గం. దీనివల్ల చాలావరకు వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావచ్చు. కాబట్టి, మీ అల్లుడిని మంచి సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. వారు పరీక్షించి తగిన సలహా ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- మీరైతే ఏం చేస్తారు?
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!