మావాడు అమ్మాయిలతోనే ఉంటున్నాడు!

మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మా బాబు వయసు పదమూడేళ్లు. మాకు వాడి  ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తోంది. మగ పిల్లలతో కలిసిమెలిసి ఉండలేడు. వాళ్లతో ఆడుకోడు. కానీ, మా చుట్టుపక్కల అమ్మాయిలతో మాత్రం కలివిడిగా ఉంటాడు.

Published : 28 Nov 2023 20:29 IST

మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మా బాబు వయసు పదమూడేళ్లు. మాకు వాడి  ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తోంది. మగ పిల్లలతో కలిసిమెలిసి ఉండలేడు. వాళ్లతో ఆడుకోడు. కానీ, మా చుట్టుపక్కల అమ్మాయిలతో మాత్రం కలివిడిగా ఉంటాడు. వాళ్లతో ఉన్నప్పుడు చాలా హుషారుగా కనిపిస్తాడు. ఎందుకలా చేస్తున్నాడు? వాడి ప్రవర్తనను ఏ విధంగా భావించాలో మాకు అర్థం కావట్లేదు. వాడి విషయంలో చాలా ఆందోళనగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. కౌమార దశలో ఉన్న పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన సహజం. పిల్లలు టీనేజ్‌ దశలోకి అడుగుపెట్టాక వారి శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. దానివల్ల వారి ప్రవర్తనలో కూడా మార్పులొస్తుంటాయి. ఇందులో భాగంగానే మీ అబ్బాయి.. అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడడం, వారితో కలిసి ఉండడం.. వంటివి చేస్తుండచ్చు. అయితే మీ అబ్బాయి ప్రవర్తనను మార్చాలంటే ముందు అతడి స్నేహితులను మార్చే ప్రయత్నం చేయండి. స్కూల్లో బాగా చదివే, క్రమశిక్షణ కలిగిన అబ్బాయిలతో స్నేహం చేసేలా మీ బాబును ప్రోత్సహించండి. అలాగే మీ అబ్బాయి ఆలోచనలు అమ్మాయిల మీదకు కాకుండా భవిష్యత్తుపైకి మళ్లేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇందుకోసం అతనికి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించండి. వాటిని సాధిస్తే మంచి బహుమతి ఇస్తామని చెప్పండి. దానివల్ల కూడా అతని ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికీ అతనిలో మార్పు రాకపోతే సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లండి. వారు మీ బాబులో ఉన్న అసలు సమస్యను పసిగట్టి తగిన పరిష్కార మార్గాలు సూచిస్తారు. కాబట్టి, కంగారు పడకుండా సానుకూలంగా ఆలోచిస్తూ మీ బాబును మార్చుకునే ప్రయత్నం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్