ఒంటరిగా పెంచాల్సివస్తే..

తల్లిదండ్రులు విడిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పిల్లలను బాధ్యతగా తీసుకోకపోతే వాళ్లు డ్రాప్‌ అవుట్స్‌ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే పలురకాల శారీరక, మానసిక అనారోగ్యాలబారిన పడే ప్రమాదమూ ఉంది.

Published : 01 Feb 2023 00:21 IST

తల్లిదండ్రులు విడిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు పిల్లలను బాధ్యతగా తీసుకోకపోతే వాళ్లు డ్రాప్‌ అవుట్స్‌ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే పలురకాల శారీరక, మానసిక అనారోగ్యాలబారిన పడే ప్రమాదమూ ఉంది. అయితే వీటన్నింటినీ అధిగమించి ఒంటరిగానైనా చిన్నారులను ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దొచ్చంటున్నారు మానసిక నిపుణులు..

మ్మానాన్న విడిపోవడం లేదా ఇరువురిలో ఎవరో ఒకరు చనిపోతే.. వాళ్లల్లో మిగిలిన ఆ ఒక్కరూ ఒంటరిగానే పిల్లల బాధ్యత సంపూర్ణంగా తీసుకోవాలి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యంతో పిల్లలను పెంచగలిగితే ఆ చిన్నారులు బలమైన వ్యక్తితత్వం ఉన్న వ్యక్తులుగా ఎదుగుతారు.

ప్రయత్నించాలి.. ఒంటరిగా పిల్లలను పెంచాల్సివచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలనూ పరిష్కరించుకోగలగాలి. చిన్నారులకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, సామాజికపరమైన ఒత్తిడి వంటి ఛాలెంజ్‌లను తట్టుకొని నిలబడాలి. తనకోసం, తన పిల్లల కోసం వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికి సానుకూలతగా ఆలోచించాలి. భర్త లేదా భార్య తన నుంచి దూరంగా లేక శాశ్వతంగా దూరమైనప్పుడు మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, స్వీయసానుభూతి మొదలవుతాయి. వీటన్నింటినీ దూరం చేసుకోగలగాలి. ఉద్యోగం, క్షణం తీరికలేకుండా పనిచేయడం, తమ పిల్లల సంరక్షణపై శ్రద్ధచూపించడం, జీవితాన్ని సమన్వయం చేసుకోవడం వంటివి సాధన చేయాలి.

అంకితభావంతో.. తల్లిదండ్రుల వద్ద సంతోషంగా పెరగాల్సిన పిల్లలు అలా అమ్మ లేదా నాన్న వద్ద మాత్రమే ఎదగాల్సి రావడం ఆ చిన్నారుల్లోనూ ఒత్తిడిని కలిగిస్తుంది. కొందరు కుంగుబాటుకూ గురవుతారు. ఇలా జరగకుండా ఉండాలంటే.. పిల్లలను మరింత ప్రేమించాలి. వారు చెప్పే ప్రతి విషయాన్నీ సహనంగా వినడం, వారి సమస్యలను విని పరిష్కరించడానికి ప్రయత్నించడంవంటివి చేయాలి. చదువులో వెనుకబడినా కృషితో తిరిగి వారిని మంచి మార్గంలోకి మళ్లించాలి. కోప్పడటం, ఇతర పిల్లలతో పోల్చడం, దండించడం, దూషించడం వంటివి చేయకూడదు. వారిపట్ల సున్నితంగా ప్రవర్తించాలి. ఇలా మరింత ప్రేమ, గౌరవాన్ని అందించగలిగితే చాలు. తమకోసం అమ్మ లేదా నాన్న ఉన్నారనే భరోసా వారికి కలిగి చదువులో, జీవితంలో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్