అతడిని నేను మతాంతర వివాహం చేసుకోవడం సబబేనా?

హాయ్‌ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు......

Updated : 18 Apr 2022 12:07 IST

హాయ్‌ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తాయా? అన్న ఆలోచనలు వస్తున్నాయి. తన మీద నాకు నమ్మకం ఉంది.. బాగా చూసుకుంటాడు.. కానీ అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. చిన్న చిన్న విషయాలకే నేను సహకరించడం లేదని కోపగించుకోవడం, గొడవ పడడం చేస్తుంటాడు. తను ఇంకా సెటిల్‌ అవ్వలేదు. జాబ్‌ గురించి వెయిట్‌ చేస్తున్నాడు. నేను బీపీవోలో వర్క్‌ చేస్తున్నాను. పెళ్లయ్యాక కూడా జాబ్‌ చేస్తాను. వాళ్లది పేద కుటుంబం. సొంత ఇల్లు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అతనిని మతాంతర వివాహం చేసుకోవడం కరక్టేనా?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఒక వ్యక్తిని ఇష్టపడడం, మీకోసం అతను మతాన్ని మార్చుకోవడం, మీ ఇంట్లో ఒప్పుకోవడం జరిగిపోయాయి. అయితే మీ సాన్నిహిత్యంలో ఇన్ని రోజులూ రాని అనుమానాలు ఇప్పుడు రావడానికి కారణం ఏమిటో మీకు మీరు విశ్లేషించుకోండి. అతను ఉద్యోగం చేయడం లేదు, ఇంకా సెటిల్‌ అవ్వలేదు కాబట్టి భవిష్యత్తులో మీకు భారం అవుతాడేమో అన్న భయం మీ మనసులో ఎక్కడైనా ఉందా? అలాంటి సందర్భంలో ఇద్దరూ సెటిల్‌ అయ్యేవరకూ ఆగాలనుకుంటున్నారా..? ఇలాంటివన్నీ ఆలోచించుకోండి.

పెళ్లంటే ఇద్దరి ఆలోచనలు కలవడం, అభిప్రాయాలు పంచుకోవడం, అనుబంధాలు పెంచుకోవడం.. వంటివన్నీ ముఖ్యమైనవి. అయితే ఎంత దగ్గరివారికైనా డబ్బు దగ్గరకు వచ్చేసరికి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాల గురించి ఇద్దరూ మాట్లాడుకొని ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే భవిష్యత్తు గురించిన ఆలోచనలు, బాధ్యతలపైన కూడా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాతే ముందడుగు వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్