Dandu Supraja: పాత నగలకి కొత్త రూపునిస్తా

ఆలోచన ఉండాలే కానీ, సృష్టిలో ఏదీ పనికిరానిది కాదు. దాన్ని అర్థం చేసుకోవడం వల్లేనేమో! ప్రపంచమంతా  ఇప్పుడు...‘రీసైకిల్డ్‌ ఫ్యాషన్‌’ని ఫాలో అయిపోతోంది. హైదరాబాద్‌కి చెందినదండు సుప్రజ కూడా ఈ సూత్రాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు.

Updated : 14 Apr 2023 03:45 IST

ఆలోచన ఉండాలే కానీ, సృష్టిలో ఏదీ పనికిరానిది కాదు. దాన్ని అర్థం చేసుకోవడం వల్లేనేమో! ప్రపంచమంతా  ఇప్పుడు...‘రీసైకిల్డ్‌ ఫ్యాషన్‌’ని ఫాలో అయిపోతోంది. హైదరాబాద్‌కి చెందిన
దండు సుప్రజ కూడా ఈ సూత్రాన్నే వ్యాపారంగా మలుచుకున్నారు. పాత వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగలకు కొత్త రూపుని తెచ్చి పెడుతున్నారు ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

మాది నల్గొండ జిల్లా వాడపల్లి. నాన్న సత్యనారాయణ, అమ్మ సుకన్య. నాకో అన్నయ్య. మాది వ్యాపార కుటుంబం. బీటెక్‌ పూర్తయ్యాక పెళ్లయ్యింది. మా వారు రాఘవేంద్ర ఐటీ ఉద్యోగి. కొన్నాళ్లు స్విట్జర్లాండ్‌లోనూ ఉన్నాం. నేను గర్భం దాల్చడంతో తిరిగి అత్తారింటికి హైదరాబాద్‌ వచ్చేశాం. మాకో పాప, బాబు. వీరిని దగ్గరుండి చూసుకోవచ్చన్న భావన, వ్యాపారం చేయాలన్న ఆసక్తి నన్ను ఇటువైపు నడిపించాయి. అయితే, అది అందరికీ ఉపయోగపడేదే కాదు పర్యావరణ హితంగానూ ఉండాలనుకున్నా. కుటుంబ సభ్యులూ ప్రోత్సహించడంతో.. నగల వ్యాపారంలోకి వచ్చా. సిల్క్‌త్రెడ్‌, ఆక్సిడైజ్డ్‌, వివిధ రాష్ట్రాల సంప్రదాయ డిజైన్లను ఆర్డరు మీద చేయించి అమ్మేదాన్ని. వ్యాపారం మంచిగానే సాగేది. అయినా కొత్తగా ఏదో చేయాలనే తపన మొదలైంది. అప్పుడొచ్చిందే వన్‌గ్రామ్‌ జ్యువెలరీని రీసైకిల్‌ చేయాలనే ఆలోచన. ఇటీవల ఈ తరహా నగల కొనుగోళ్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కానీ, కొన్నాళ్లకే గాజు రంగు మారిందనో, గొలుసుకి పూసలు ఊడాయనో... చాలామంది వాటిని పడేస్తుంటారు. అలాంటివి వృథా కాకుండా... కొత్త రూపు ఇవ్వడమే మా ప్రత్యేకత.

సామాజిక మాధ్యమాల ద్వారా..

పాతవాటిని కొత్తగా మార్చాలన్నా... మొత్తంగా డిజైన్‌నే రీమోడల్‌ చేయాలన్నా కూడా చేస్తాం. ఈ విధానం కొత్తది కావడంతో తక్కువ కాలంలోనే మా వ్యాపారానికి మంచి పేరొచ్చింది. దాంతో ‘అతిథి లైన్‌’ పేరుతో వెబ్‌సైట్‌ ప్రారంభించాం. ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి వాటి ద్వారా దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు అందుకుంటున్నాం. ఓ సారి అమెరికాలో ఎగ్జిబిషన్‌ పెడితే రెండు గంటల వ్యవధిలో దాదాపు లక్షన్నర రూపాయల జ్యువెలరీ అమ్ముడుపోయింది. ఇలాంటి సంఘటనలెన్నో. రూ.50 వేలతో మొదలు పెట్టిన ఈ వ్యాపారంతో ఇప్పుడు ఏటా 60 లక్షల రూపాయల వరకూ టర్నోవర్‌ సాధిస్తున్నాం. అలా నేను ఉపాధి పొందడమే కాదు... మరో 30 మందికి ఉద్యోగాలిచ్చి చేయూతనివ్వగలుగుతున్నా. రిటైల్‌, హోల్‌సేల్‌ అమ్మకాలతోపాటూ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కీర్తన సునీల్‌ సాయంతో సదా, రాధ వంటి యాక్టర్లకు, యాంకర్లకు కూడా కస్టమైజ్డ్‌ జ్యువెలరీ చేసిస్తున్నా. ఇదంతా ఇష్టంగా చేస్తున్నా కాబట్టే ఆటుపోట్లన్నింటినీ సమానంగా స్వీకరించగలుగుతున్నా.

 దామా వినీత, హైదరాబాద్‌


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్