అతడిని చూడగానే నా మనసులో ప్రేమగంట మోగింది!

వందమందిలో ఉన్నా మనసుకు నచ్చిన వాడు కనిపించగానే గుండెల్లో ప్రేమ గంట మోగుతుందంటుంటారు. అలీ ఫజల్‌ను చూడగానే తన మనసులోనూ ఇలాంటి ఫీలింగే కలిగిందంటోంది బాలీవుడ్‌ అందాల తార రిచా చద్దా. దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉంది ఈ జంట. సుమారు రెండున్నరేళ్ల క్రితమే రిజిస్టర్...

Published : 05 Oct 2022 11:39 IST

(Photos: Instagram)

వందమందిలో ఉన్నా మనసుకు నచ్చిన వాడు కనిపించగానే గుండెల్లో ప్రేమ గంట మోగుతుందంటుంటారు. అలీ ఫజల్‌ను చూడగానే తన మనసులోనూ ఇలాంటి ఫీలింగే కలిగిందంటోంది బాలీవుడ్‌ అందాల తార రిచా చద్దా. దాదాపు పదేళ్లుగా ప్రేమలో ఉంది ఈ జంట. సుమారు రెండున్నరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వీరిద్దరూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తాజాగా వివాహ వేడుకలు జరుపుకొన్నారు. ఈ క్రమంలో అసలు వీళ్ల ప్రేమ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్‌ చేశారు? తెలుసుకోవాలంటే.. ఈ ముద్దుల జంట ప్రేమకథ చదివేయండి!

తొలి సినిమా సమయంలో సహ నటులతో ప్రేమలో పడి.. వాళ్లనే పెళ్లి చేసుకున్న జంటలు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది. రిచా-అలీ కూడా అందుకు మినహాయింపు కాదు. ‘ఫక్రే’ సినిమా చిత్రీకరణ సమయంలో తొలిసారి కలుసుకుందీ జంట. చూసుకుంది మొదటిసారే అయినా.. ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్ల ఆత్మీయ అనుబంధం ఉన్నట్లనిపించిందని చెబుతున్నారీ క్యూట్‌ కపుల్.

చూడగానే నచ్చేశాడు!

‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అంటుంటారు. అలీని చూడగానే తన మనసులోనూ అతనిపై ఓ మంచి అభిప్రాయం ఏర్పడిందంటోంది రిచా. ‘ఫక్రే సెట్స్‌లో తొలిసారి అలీని కలుసుకున్నా. తొలి చూపులోనే అతడిపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అతడి మాటతీరులో మర్యాద నాకెంతో నచ్చింది. అతడి చిలిపితనం, క్రేజీనెస్‌ నా ప్రవర్తనకు దగ్గరగా అనిపించాయి. సెట్స్‌లో ఎంతోమంది ఉన్నా.. నా కళ్లు అలీనే వెతికేవి.. ఈ ఆలోచనలే నా మనసును తనకు అంకితం చేశాయి.. బహుశా దీన్నే ప్రేమంటారేమో అనుకున్నా..’ అంటూ తన తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ బ్యూటీ.

నేను ఆమె అభిమానిని!

అలీ మనసును చూసి తన మనసు పారేసుకున్నానని రిచా అంటుంటే.. అంతకుముందే తన నటనకు ఫిదా అయ్యానని చెబుతున్నాడు అలీ. ‘రిచాను కలుసుకోకముందే తనను తెర మీద చూశాను. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్‌’ సినిమాలో ఆమె నటన నన్ను కట్టిపడేసింది. పని పట్ల తనకున్న అంకితభావం, నటన చూసి నేను స్ఫూర్తి పొందాను. తొలి సినిమాలోనే తనతో కలిసి నటించడం ఓ అందమైన అనుభూతి!’ అంటాడీ హీరో. ‘ఫక్రే’ తర్వాత ‘ఫక్రే రిటర్న్స్‌’, ‘ఫక్రే-3’ సినిమాల్లోనూ కలిసి నటించిందీ జంట.

ముందు నేనే ప్రపోజ్‌ చేశా!

సాధారణంగా ప్రేమలో అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్‌ చేసి ప్రేమను తెలియజేయడం చూస్తుంటాం.. కానీ తానే అలీకి ముందుగా తన మనసులోని ఫీలింగ్స్‌ని తెలియజేశానంటోంది రిచా. ‘ఓరోజు నేను, అలీ మా ఇంట్లో కూర్చొని చాప్లిన్‌ సినిమా చూస్తున్నాం. తనూ ఆ సినిమాను ఎంతో ఎంజాయ్‌ చేయడం చూశా. నిజానికి మనకు ఇష్టమైన వారి అభిరుచులు కూడా మన ఇష్టాయిష్టాలతో ఏకీభవిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? నా మనసులోని ఇష్టాన్ని తెలపడానికి అదే మంచి తరుణం అనిపించింది. వెంటనే ‘ఐ లవ్యూ!’ అనేశా!’ అంటూ చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

అయితే ఇలా ముందుగా తానే ప్రపోజ్‌ చేసినా.. 2019లో మాల్దీవులకు వెళ్లినప్పుడు.. డిన్నర్‌ సమయంలో అలీ చేసిన ప్రేమ ప్రతిపాదన తనకెప్పటికీ మధుర జ్ఞాపకమే అంటోంది రిచా.  ‘అప్పటికే అతడిపై నాకు పీకల్లోతు ప్రేముంది. తను అలా ప్రపోజ్‌ చేసే సరికి కాస్త నెర్వస్‌గా అనిపించింది. అందుకే పది నిమిషాల సమయం తీసుకొని.. ఆ తర్వాతే యస్‌ చెప్పానం’టోంది రిచా.

ఒక్క ఫొటోతో.. విషయం చెప్పేశాడు!

ఇలా దాదాపు ఐదేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో తమ ప్రేమ గురించి అధికారికంగా ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ‘వెనిస్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో చెట్టపట్టాలేసుకొని కనిపించిందీ జంట. అప్పుడే వీళ్ల ప్రేమ విషయం బయటికి పొక్కింది. అదే ఫొటోను పంచుకున్న అలీ ‘ఇది నాకెంతో నచ్చిన ఫొటోల్లో ఒకటి!’ అంటూ తన లేడీ లవ్‌ గురించి చెప్పకనే చెప్పేశాడు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, ఫ్యాషన్‌ షోలు, సెలబ్రిటీ పార్టీల్లో కనిపిస్తూ సందడి చేయడం, ఫొటోషూట్లకు పోజులివ్వడం, వివిధ ప్రదేశాలకు వెకేషన్లకు వెళ్లడం.. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్