Heroins: మాతృత్వంలో.. మేము!

అమ్మవడం ప్రతి అమ్మాయి జీవితంలో కొత్త మలుపే! అది వాళ్ల జీవితాల్ని ఎలా మార్చిందో పంచుకున్నారీ కొత్త అమ్మలు. వీరి ప్రయాణాన్ని మీరూ చదివేయండి!

Updated : 14 May 2023 10:10 IST

అమ్మవడం ప్రతి అమ్మాయి జీవితంలో కొత్త మలుపే! అది వాళ్ల జీవితాల్ని ఎలా మార్చిందో పంచుకున్నారీ కొత్త అమ్మలు. వీరి ప్రయాణాన్ని మీరూ చదివేయండి!


ఏం చేస్తున్నా.. తన గురించే!

ప్రణీత

మ్మని అవ్వబోతున్నా అని తెలిసినప్పటి నుంచీ ఏం చేస్తున్నా ముందు ‘బిడ్డ’ గురించే ఆలోచించడం మొదలుపెట్టా. మా పాప అర్నా పుట్టాకా అదో అలవాటుగా మారింది. ఎన్నో నిద్రలేని రాత్రులు, కెరియర్‌లో వెనకబడ్డా తన కంటే ఏదీ ఎక్కువ కాదనే అనిపిస్తోంది. అమ్మానాన్న మనకోసం ఏం చేసినా అది వాళ్ల బాధ్యత అని తేలిగ్గా తీసుకుంటాం. మనం తల్లయ్యాక కానీ వాళ్ల ప్రేమ అర్థమవదు. బయటకు వెళ్లాలన్నా.. పెట్టుబడి పెట్టాలన్నా తన భద్రత, భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నా. కొద్దిసేపు అర్నాని వదిలి వెళ్లాలన్నా మనసొప్పేది కాదు. తాజాగా తిరిగి నటన మొదలుపెట్టా. ఇప్పుడు ఎక్కువ సమయం వదలక తప్పట్లేదు. ఎప్పుడెప్పుడు తన ముందు వాలిపోదామా అన్న ఆలోచనలే. అప్పటివరకూ అందరిలా మామూలు అమ్మాయినే కదా! అమ్మనయ్యే సరికి ఎంత మార్పు. బహుశా అమ్మతనం గొప్పదనమే అదేమో!


నేర్చుకుంటూ వెళుతున్నా అలియా భట్‌

రెండేళ్లు నా జీవితంలో క్షణం తీరిక లేదన్నట్టుగా గడిచిపోయాయి. పెళ్లి, సినిమా షూటింగ్‌లు, గర్భం దాల్చడం, ప్రసవమైన కొన్నిరోజులకే ఒప్పుకొన్న ప్రాజెక్టులను పూర్తిచేసే పనిలో పడిపోయా. చాలామంది భావన పాపని పట్టించుకోవడం లేదనే! పని పూర్తిచేసుకొని ఇంటికొచ్చాక బోసినవ్వులతో స్వాగతం పలికే నా పాప రాహాని చూస్తే అలసటంతా తీరినట్లు అనిపిస్తుంది. పాపని హత్తుకున్నప్పుడు తన పెరుగుదలను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానే అన్న అపరాధ భావనా కలుగుతుంది. పనికీ, పాపకీ సమన్యాయం చేస్తున్నానా అన్న సందేహం కూడా. తట్టుకోలేక మానసిక ఆరోగ్యం కోసం నిపుణులను సంప్రదించానంటే ఎంత ఒత్తిడి అనుభవించానో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితిలో కొద్దిగా మార్పొచ్చింది. ‘ఇదో నేర్చుకునే దశ. అందరి జీవితం ఒకలా ఉండదు. అమ్మగా ఫలానా అని స్పష్టమైన దారి ఉండదు. నేర్చుకుంటూ మార్గాన్ని సృష్టించుకుంటూ వెళ్లడమే నా పని’ అని అర్థమయ్యాక కెరియర్‌నీ, ఇంటినీ సమర్థంగా నిర్వహించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.


నన్నలా చూపించాలనీ.. కాజల్‌ అగర్వాల్‌

ర్భవతిగా ఉన్నప్పుడు లావయ్యాననే ట్రోల్స్‌, మా బాబు నీల్‌ పుట్టిన కొన్ని నెలలకే తిరిగి పని మొదలుపెడితే ‘బాబుని వదిలేశా’వంటూ కామెంట్లు.. ఎవరేమన్నా బాబుకే నా తొలి ప్రాధాన్యం. మొదటిసారి వాడిని గుండెలకు హత్తుకున్నప్పుడు చాలా భయపడ్డా. అమ్మగా వాడిని జాగ్రత్తగా పెంచగలనా అనుకున్నా. కానీ ప్రతిదీ నేర్చుకుంటూ నన్ను నేను సరిదిద్దుకుంటూ వచ్చా. ప్రతి ఉదయం వాడిని వదిలి పని కోసమని బయటకు వస్తోంటే నా మనసు బాధతో విలవిల్లాడుతుంది. అలాగని వాడిని నిర్లక్ష్యం చేస్తున్నానని కాదు. నీల్‌ కోసం సమయం కేటాయించుకోవడం, ప్రేమను పంచడం, వాడి బాగోగులకు ప్రాధాన్యమిస్తూనే పనివేళల్నీ సమన్వయం చేసుకుంటున్నా. తన ముందు ఓ బలమైన అమ్మలా నిలవాలనుకుంటున్నా. వాడు పెద్దయ్యాక ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడని నా గట్టి నమ్మకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్