Sreeleela: ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా బ్యాకప్‌ ఉండాలి

చేతినిండా సినిమాలతో కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నారు నటి శ్రీలీల. ఓవైపు ఎంబీబీఎస్‌ చదువుతూనే మరోవైపు టాప్‌ హీరోల సరసన ఆఫర్స్‌ సొంతం చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.

Updated : 17 Nov 2023 15:55 IST

(Photos: Instagram)

చేతినిండా సినిమాలతో కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్నారు నటి శ్రీలీల. ఓవైపు ఎంబీబీఎస్‌ చదువుతూనే మరోవైపు టాప్‌ హీరోల సరసన ఆఫర్స్‌ సొంతం చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. తన తదుపరి చిత్రం ‘ఆదికేశవ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఎంబీబీఎస్‌ చదవడంపై మాట్లాడారు.

‘‘డాక్టర్‌ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నా. నేను తప్పకుండా డాక్టర్‌ అవుతానని ఇంట్లో వాళ్లకు మాటిచ్చా. నటిగా ఉంటూనే ఎంబీబీఎస్‌ పూర్తి చేసేందుకూ సిద్ధం అవుతున్నా. నటిగా ప్రేక్షకులను అలరించటాన్ని, వాళ్ల ప్రేమాభిమానాలు పొందటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. అలాగే, డాక్టర్‌ కావడం నా తొలి ప్రాధాన్యం. నా అభిప్రాయం ప్రకారం.. ప్రతి అమ్మాయికీ వృత్తిపరంగా అలాంటి బ్యాకప్ తప్పక ఉండాలి. నటిగా నా అభినయంతో.. లేదంటే వైద్యురాలిగా చికిత్స అందించడం ద్వారా ప్రజలకు స్వాంతన ఇవ్వాలనుకుంటున్నా’’ అని తెలిపారు.

శ్రీలీల ప్రస్తుతం ‘ఆదికేశవ’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘ఆదికేశవ’ నవంబర్‌ 24న విడుదల కానుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్