పెద్దమ్మాయి చిన్నమ్మాయి కంటే డల్‌గా ఉంటోంది..

మాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయికి ఆరేళ్లు. చిన్నమ్మాయికి నాలుగేళ్లు. అయితే చాలా అంశాల్లో మా పెద్దమ్మాయి కంటే చిన్నమ్మాయి చురుగ్గా ఉంటోంది. చిన్నమ్మాయి ఏదైనా చెబితే వెంటనే గ్రహిస్తుంది. ఎక్కువగా మాట్లాడుతుంటుంది. అలాగే చెప్పిన పనులు....

Published : 04 Feb 2023 15:29 IST

మాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయికి ఆరేళ్లు. చిన్నమ్మాయికి నాలుగేళ్లు. అయితే చాలా అంశాల్లో మా పెద్దమ్మాయి కంటే చిన్నమ్మాయి చురుగ్గా ఉంటోంది. చిన్నమ్మాయి ఏదైనా చెబితే వెంటనే గ్రహిస్తుంది. ఎక్కువగా మాట్లాడుతుంటుంది. అలాగే చెప్పిన పనులు చేస్తుంటుంది. జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే. కానీ, పెద్దమ్మాయి.. చిన్నమ్మాయి కంటే చాలా విషయాల్లో వెనకబడుతోంది. తనలో పెద్దయ్యాక కూడా తెలివితేటలు తక్కువగా ఉంటాయా? చిన్నమ్మాయిలా తను కూడా చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. చాలామంది తమ పిల్లల్లోని మానసిక సమస్యలను ఆలస్యంగా గుర్తిస్తుంటారు. దానివల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ, మీరు మీ పెద్దమ్మాయిలోని సమస్యను చాలా ముందుగానే గుర్తించారు. ఇది చాలా మంచి విషయం. అయితే మన సమాజంలో చాలామంది పిల్లలకు బుద్ధి లోపం ఉంటోంది. అయితే ఈ సమస్యను సరైన సమయంలో గుర్తించకపోతే తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటుంది. కానీ, మీ అమ్మాయిలోని సమస్యను మీరు చాలా తొందరగానే గుర్తించారు. మీ పాపను మొదట చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు తీసుకెళ్లండి. వారు ఐక్యూతో పాటు ఎదుగుదల, నేర్చుకోవడం, చదవడం, తెలివితేటలు.. వంటి పలు అంశాల వారీగా చెక్‌ చేసి ఏ అంశంలో లోపం ఉందో చెబుతారు. దాన్ని బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ థెరపీని అందించాలి? వంటి విషయాలను చెబుతారు. కొన్ని సమస్యలకు స్పెషల్‌ డైట్‌ కూడా ఇస్తుంటారు. దీని గురించి చాలామందికి అవగాహన ఉండదు. కాబట్టి, మీరు వెళ్లిన నిపుణుల దగ్గర డైట్ విషయం కూడా అడిగి తెలుసుకోండి. ఇలా థెరపీతో పాటు వారు చెప్పిన డైట్‌ని ఫాలో అయితే మీరు ఆశించిన ఫలితం పొందే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్