Parenting: అల్లరికి ఆనకట్ట
వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇల్లంతా ఆగమాగం చేస్తున్నారా? కంగారుపడకండి. వాళ్ల ఆగడాలను అరికట్టే మార్గాలు చాలానే ఉన్నాయి.
వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇల్లంతా ఆగమాగం చేస్తున్నారా? కంగారుపడకండి. వాళ్ల ఆగడాలను అరికట్టే మార్గాలు చాలానే ఉన్నాయి. మీకు నచ్చేలా, సిసింద్రీలు మెచ్చేలా ఇలాంటివి ఎంచుకోండి...
* మీ చిన్నారి చదివిన లేదా విన్న కథను మళ్లీ అందంగా చెప్పమనండి. ఆసక్తి కలిగించేలా మాట్లాడటం అలవాటవుతుంది.
* ఒక చిన్న కథ చదివి, దానికి ఎలాంటి బొమ్మ బాగుంటుందో చేతనైనట్లు వేయమనండి.
* సంక్షిప్తంగా మీ కుటుంబ చరిత్ర రాయమనండి. అవసరమైన వివరాలను తాతమ్మ, నాన్నమ్మ, పెదనాన్న, మావయ్య, పెద్దమ్మ, పిన్ని.. ఇలా అందరితో మాట్లాడి తనే సేకరించాలి.
* మెదడుకు పదునుపెట్టే ప్రశ్నలు అడగండి. చక్కటి జవాబులు చెబితే కానుకలు ఇవ్వండి. పత్రికల్లో పజిల్స్ నింపమనండి. దేశ పటాలు లాంటివి విడగొట్టి క్రమ పద్ధతిలో కలిపే ఇమేజ్-మేక్ పజిల్‌ని వేగంగా పేర్చేలా పోటీ పెట్టండి. దేశాల రాజధానులు, కరెన్సీలు లాంటివి నేర్చుకున్నాక పొరుగింటి పిల్లలందరినీ కూర్చోబెట్టి పోటీ పెట్టండి. ఇలాంటివన్నీ అల్లరి చేష్టల్ని తగ్గించడమే కాదు, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి.
* వాళ్ల ఆసక్తులు, అభిరుచులకు తగిన పుస్తకాలు కొనివ్వండి. అందులో పరిజ్ఞానం పెంచుకునేలా ప్రోత్సహించండి. పాఠాలు చదువుతున్నట్లు విసుగు అనిపించకుండా మీరు జోక్యం చేసుకుంటూ వాటికి సంబంధించిన ఆసక్తికరమైన సంగతులు చెబుతుండండి.
* టీవీ చూడటం, మొబైల్‌తో కాలక్షేపం, కంప్యూటర్ గేమ్స్ కాకుండా కోకో, కబడ్డీ, క్యారమ్స్, చదరంగం లాంటి ఆరోగ్యకరమైన ఆటలు ఆడేలా ప్రోత్సహించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.