Relationship: ఒకేలా ఉండక్కర్లేదు... ఒక మాట మీద ఉంటే చాలు!

ఎంత భార్యాభర్తలైతే మాత్రం...ఇద్దరూ ఒకేలా ఆలోచించలేరు. ఒకేలా ప్రవర్తించలేరు. సందర్భాన్ని బట్టి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించడం, కుదరకపోతే మధ్యే మార్గం ఎంచుకోవడం వంటివి చేయాలి.

Published : 24 May 2023 00:49 IST

ఎంత భార్యాభర్తలైతే మాత్రం...ఇద్దరూ ఒకేలా ఆలోచించలేరు. ఒకేలా ప్రవర్తించలేరు. సందర్భాన్ని బట్టి ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించడం, కుదరకపోతే మధ్యే మార్గం ఎంచుకోవడం వంటివి చేయాలి. అప్పుడే సంసారాన్ని సంతోషంగా నడిపించొచ్చు.

* కొంతమంది పెళ్లైన తర్వాత భాగస్వామికోసం తమ అలవాట్లను మార్చుకుంటారు. చిన్నతనం నుంచి ఎంతో ఇష్టమైన వాటిని తినడం కూడా మానేస్తారు. మొదట్లో ఇది బానే ఉన్నా.. కొంతకాలానికి ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. దాంతో గతంలో మాదిరిగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండలేరు.

* మరికొందరు తను తప్ప భాగస్వామికి వేరే ప్రపంచం ఉండకూడదని కాస్త సంకుచితంగా ఆలోచిస్తారు. ఇలాచేయడం వల్ల ఎదుటివాళ్లు బంధువులు, స్నేహితులకు దూరమై మానసికంగా ఒంటరితనంతో బాధపడతారు. ఇది ఇలాగే కొనసాగితే కొంత కాలానికే జీవితం యాంత్రికంగా మారుతుంది.

* పెళ్లంటే మన అభిప్రాయాలు, ఆలోచనలను ఎదుటివారి మీద రుద్దడం కాదనే విషయాన్ని గుర్తించాలి. అలాగే వ్యక్తిగత అలవాట్లు, అభిరుచులను ఎదుటివారి కోసం బలవంతాన మార్చుకోవాలని ప్రయత్నిస్తే కొంతకాలానికి తమ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.అది నిర్లిప్తతకూ, కుంగుబాటుకీ దారితీస్తుంది.

* భాగస్వామికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ కలగజేసుకోవాలని ప్రయత్నించకూడదు. ఎవరి పరిధిలో వాళ్లుంటూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తే ఎలాంటి మనస్పర్థలకూ అవకాశముండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్