
జుట్టుకు, చర్మానికీ ఒకే సౌందర్య మంత్రం!
సౌందర్య పరిరక్షణలో భాగంగా శిరోజాలకు, చర్మ సంరక్షణకు వేర్వేరు రకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటాం. మార్కెట్లో సైతం వాటికి సంబంధించిన సౌందర్య ఉత్పత్తులు విడిగానే లభ్యమవుతాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను మాత్రం అటు చర్మ సౌందర్యాన్ని, ఇటు కురుల ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఉపయోగించవచ్చు. మరి అవేంటో చూద్దాం రండి.
కొబ్బరి నూనె
సాధారణంగా కొబ్బరి నూనెను మనం శిరోజాల సంరక్షణకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అది జుట్టుకి పోషణనిచ్చి దృఢంగా అయ్యేలా చేస్తుంది. అయితే దీన్ని మనం చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. దీనిలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలుంటాయి. కాబట్టి సౌందర్య పోషణలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
అవకాడో..
చక్కటి ఆరోగ్యాన్నిచ్చే అవకాడో అందాన్ని సైతం పెంపొందిస్తుంది. ఇది చర్మంలోని ఫ్రీరాడికల్స్‌ని బయటకు పంపిస్తుంది. దీనిలో ఉన్న మాయిశ్చరైజింగ్ గుణాలు జుట్టుకి, చర్మానికి పోషణనందిస్తాయి. రోజూ సగం అవకాడో ముక్కను ఆహారంగా తీసుకోవడం ద్వారా చర్మం, కురులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.
తేనె..
సౌందర్యాన్నందించే సహజసిద్ధమైన పదార్థాల్లో తేనె కూడా ఒకటి. దీనిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, ఆవశ్యక విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. ఇవి ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా పరిరక్షిస్తాయి. ఇది కురులకు కండిషనర్‌లా పనిచేస్తుంది. చర్మం పీహెచ్ విలువను సమతౌల్యం చేసి ముడతలు పడకుండా కాపాడుతుంది. అయితే దీనికోసం సహజసిద్ధమైన తేనెను ఉపయోగించడం మంచిది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో సౌందర్యాన్ని పరిరక్షించే ఎన్నో అద్భుతమైన గుణాలున్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మం, వెంట్రుకలు పాడవకుండా ఇవి కాపాడతాయి. అలాగే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. వయసు ప్రభావం కారణంగా.. చర్మంపై ముడతలు రాకుండా, సాగిపోకుండా చేస్తాయి. కురుల విషయానికి వస్తే.. జుట్టు రాలిపోవడానికి కారణమైన డైహైడ్రోటెస్టోస్టిరాన్ ప్రభావాన్ని గ్రీన్ టీ తగ్గిస్తుంది. ఫలితంగా వెంట్రుకలు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.
ఆలివ్‌నూనె..
ఆలివ్‌నూనె చక్కటి ఆరోగ్యాన్నివ్వడమే కాదు.. సౌందర్యాన్ని సైతం అందిస్తుంది. ఇది జుట్టుకి పోషణనిచ్చి మృదువుగా, పట్టులా మారేలా చేస్తుంది. దీనిలో ఉన్న ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే ముదిమి ఛాయలు మీదపడకుండా చేస్తాయి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!
నగల్లో భారీతనం నేటి అమ్మాయిలకు నప్పడం లేదు. సన్నగా, నాజూగ్గా ఉండేవాటికే వారి ఓటు. మెట్టెలూ అందుకు మినహాయింపు కాదు. అలా చూసే వారికోసమే వస్తున్నాయీ నాజూకైన టో రింగ్స్. సన్నటి తీగకు చిన్న పూసలు, ముత్యాలు, రాళ్లతో సిద్ధమవుతున్నాయిలా. మహిళల మృదువైన పాదాల వేళ్లకు మరింత అందాన్ని తెచ్చేస్తూ బాగున్నాయి కదూ!తరువాయి

పట్టుచీరను ప్రత్యేకంగా..
శుభకార్యాలకు వెళ్లాలన్నా, ప్రత్యేక సందర్భం, పండుగలకైనా ధరించేది పట్టుచీరే. వీటి ఖరీదు వేల నుంచి లక్షల్లోనే ఉంటుంది. నచ్చిన పట్టుచీర కొనుక్కోగానే సరిపోదు, వాటిని జాగ్రత్తగా పరిరక్షిస్తే దశాబ్దాల తరబడి ఉపయోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇందుకు కొన్ని చిట్కాలూ.. చెబుతున్నారు.తరువాయి

జీన్స్‌తో కుర్తీ జత కలిస్తే..
వదులైన లేదా ఒంటికి పట్టినట్లుండే చొక్కా, స్వెట్ బనియన్ వంటివి గతంలో జీన్స్‌పై అందంగా ఇమిడిపోయేవి. ప్రస్తుతం అదే జీన్స్‌తో అసిమెట్రికల్ ప్రింట్ బ్లవుజు, హై లో టాప్ ఫ్రంట్ ఓపెన్ షర్ట్ ఫ్రాక్, లాంగ్‌లైన్ షర్ట్, స్ప్లిట్ షర్ట్, మెర్మెయిడ్ బ్లవుజు, లాంగ్ కోట్, ట్యూనిక్ బ్లవుజు, షిప్ట్ టాప్ అంటూ రకరకాల టాప్స్, కుర్తీలు జత కడుతున్నాయి. కొంగొత్తగా కనిపిస్తూ.. నయా ట్రెండ్‌కు అర్థం చెబుతున్నాయి....తరువాయి

మొటిమల నొప్పా?
అందమైన ముఖంపై దిష్టిచుక్కల్లా మొటిమలు కనిపిస్తుంటేనే చిరాకు. అలాంటిది కొన్నిసార్లు నొప్పీ పెడుతుంటాయి. భరించలేక పోతున్నారా? ఈ చిట్కాలను పాటించేయండి. సలిపినట్లుగా నొప్పి వస్తోంటే చాలామంది గిల్లుతుంటారు. అది పరిస్థితిని దిగజారుస్తుంది. కాబట్టి ఆ అలవాటు మానుకోండి. ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడవాలి...తరువాయి

గుడ్డుతో మచ్చలు మాయం...
ముఖంపై మచ్చలు, ఎండవల్ల కమిలి నలుపుగా మారిన ప్రాంతాన్ని మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావచ్చు. ఇందుకోసం కొన్ని టిష్యూపేపర్లు, కోడిగుడ్డు ఉంటే చాలు. కోడిగుడ్డులోని తెల్లసొనను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ముఖాన్ని మురికి లేకుండా శుభ్రం చేసి మెత్తని వస్త్రంతో తుడవాలి. తెల్లసొనలో బ్రష్ ముంచి దాన్ని ముఖంపై లేపనంలా రాసి, కంటిభాగం తప్ప, మిగతా...తరువాయి

నెక్టైలా.. నగ
పార్టీ లేదా సమావేశాలకు ధరించే షర్ట్, బ్లేజర్ వంటి అవుట్‌ఫిట్స్‌తో జతకట్టే నెక్‌టై ఇప్పుడు నగలా మారింది. చోకర్ నెక్లెస్‌లా మెరిసే క్రిస్టల్స్ టై నక్లెస్, రాళ్లు పొదిగిన పెండెంట్స్, ముత్యాలు, పూసలు, రకరకాల బీడ్స్‌తో రూపొందించిన అందమైన డిజైన్లు ఇప్పుడు నెక్‌టై నగలయ్యాయి. నయా ట్రెండ్‌గా నిలుస్తూ.. ఆధునికతకు సంప్రదాయ మెరుపును అందించి, మెడలో తళుక్కుమంటున్న ఈ కొత్త ఆభరణాలు చూడటానికి భలేగున్నాయి కదూ..తరువాయి

నేను తిరిగి నా జుట్టుని పొందగలనా?
మేడమ్.. నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని....తరువాయి

కురులు వేగంగా పెరగాలా?
పొడవైన జుట్టు చాలామంది అమ్మాయిల కల. కానీ అదేమో త్వరగా ఎదగట్లేదు అని బాధపడుతున్నారా? ఇందుకు షాంపూలు మారుస్తూ పోతే సరిపోదు. లోపల్నుంచీ పోషణ కావాలంటున్నారు నిపుణులు. కొన్నింటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమంటున్నారు. గుడ్డు.. జుట్టు పెరుగుదలలో తోడ్పడే బయోటిన్ అనే ప్రొటీన్ దీనిలో పుష్కలం. వెంట్రుకల ఫాలికిల్స్ ప్రొటీన్‌తో నిర్మితమై ఉంటాయి. అది లోపించిందో పెరుగుదల నెమ్మదించడమే కాదు.. వెంట్రుకలుతరువాయి

Tattooed Skin : ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
ఫ్యాషన్, అభిరుచితో శరీరంపై ట్యాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే వాటిని చూసుకొని మురిసిపోవడం కాకుండా.. అక్కడి చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే.. పచ్చబొట్టు పొడిపించుకున్న చర్మం, దాని చుట్టూ.....తరువాయి

మీ మేకప్‌లో ఇవి ఉన్నాయా?
వర్షాకాలం కదా... మేకప్ చెక్కు చెదరకూడదని కంటికి వాటర్‌ప్రూఫ్ మస్కారా వేస్తున్నారా? నూనె తక్కువ పడుతుంది... పాత్రలు కష్టపడి తోమే శ్రమ తప్పుతుందని నాన్‌స్టిక్ పాత్రల్నే వాడుతున్నారా? మరకలు పడని దుస్తులు, మిసమిసలాడే రగ్గులపై మనసు పారేసుకుంటున్నారా? ఈ అలవాట్లు మీకూ ఉంటే ఫరెవర్ కెమికల్స్ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు..తరువాయి

మెంతులతో ముఖం మెరుపు...
ఏ,సీ,కే విటమిన్లు, పొటాషియం, కాపర్, జింక్ వంటి ఖనిజ లవణాలున్న మెంతులు ముఖాన్ని మెరుపులీనేలా చేస్తాయి. ఆరోగ్యానికే కాదు, అందాన్ని పరిరక్షించడంలోనూ ఇవి ముందుంటాయి అంటున్నారు నిపుణులు. రెండు చెంచాల మెంతులను శుభ్రం చేసి రాత్రంతా గ్లాసు నీటిలో నాననివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో పేస్టులా చేసి వడకట్టగా వచ్చిన నీటిని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో చెంచా మొక్కజొన్నపొడి వేసితరువాయి

ఆభరణాల్లో అలనాటి నాణేలు..
వందల ఏళ్లనాటి విలువైన నాణేలు, ప్రతిష్ఠాత్మకమైన జ్ఞాపకచిహ్నాల ప్రతిరూపాలు ఆభరణాల్లో ఒదిగిపోతే ఎలా ఉంటుందని కల కంటున్నారా. ఇదే ఆలోచన డిజైనర్లకూ.. వచ్చింది. ఎలిజబెత్ జ్ఞాపక చిహ్నం, స్టాట్యూ ఆఫ్ లిబర్టీగుర్తు, దేశాల స్వాతంత్య్ర చిహ్నాలు, ప్రపంచదేశ నాణేలన్నీ లాకెట్ డాలర్లుగా, బ్రాస్లెట్స్, ఉంగరాల్లో ఇమిడితరువాయి

ఫోనుంటే చాలు!
స్మార్ట్ఫోను వచ్చాక కెమెరా, ఐపాడ్.. ఇలా ఎన్నో పక్కకు వెళ్లిపోయాయి. డబ్బులకూ స్కాన్ చేస్తే సరిపోతుంది. అయినా ఇయర్‌ఫోన్, ఐపాడ్స్, కార్డులు ఇతర అవసరాలకు పర్సు, హ్యాండ్ బ్యాగ్ కావాల్సిందే! ఆ పరిస్థితీ మార్చాలనుకున్నట్లున్నారు తయారీదారులు. వీటినే కాదు మేకప్, లిప్‌బామ్, అద్దం, కార్డ్‌హోల్డర్ వంటి వాటినీ ఫోన్కేస్కే అమరుస్తున్నారిలా! ఇకపై ఫోన్ ఒక్కటి చేతిలో ఉంటే చాలన్నమాట!తరువాయి

పత్రం... పుష్పం... సోయగం!
బంగారం, వెండి నగలు ఎన్ని పెట్టుకున్నా... ఇవన్నీ సహజమైన ప్రకృతి అందం ముందు దిగతుడుపే కదా! మాకూ ప్రకృతి అందాలంటేనే ఇష్టం అనుకొనేవారికోసం కొత్తరకం నగలు వస్తున్నాయి. అసలైన ఆకులు, పూలతో చేసిన నగలు ఇవి. చెవిపోగులు, పెండెంట్లు, ఉంగరాలుగా సందడి చేస్తున్న ఈ ఒరిజనల్ లీఫ్ ఫ్యాషన్ సొగసులని ఓసారి చూసేయండి..తరువాయి
ఆరోగ్యమస్తు
- ఈ పోషకాలతో సంతాన భాగ్యం!
- అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!
- యోగా చేస్తున్నది ఏడు శాతమే!
- ఇవి తింటే ఒత్తిడి దూరం..
- సీజనల్ వ్యాధులకు దూరంగా.. ఇలా..!
అనుబంధం
- సారీతో నేర్పించొచ్చు
- బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!
- పండంటి జీవితానికి పంచ సూత్రావళి
- పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?
- వేధింపులకు గురవుతున్నారేమో..
యూత్ కార్నర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- అందాల.. గిరి కన్య
- Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!
- ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు
- అమ్మమ్మ సూచన... కోట్ల వ్యాపారం!
'స్వీట్' హోం
- మొక్కలకు ఆహార కడ్డీలు..
- Cleaning Gadgets: వీటితో సులభంగా, శుభ్రంగా..!
- వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!
- ఈ మొక్కతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం!
- సేదతీరొచ్చు... సంతృప్తి చెందొచ్చు...
వర్క్ & లైఫ్
- ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
- పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?
- కొత్త కొలువా.. నిబంధనలు తెలుసుకున్నారా?
- ప్రశంసల్ని ఆస్వాదిస్తున్నారా?
సూపర్ విమెన్
- అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
- Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!
- 70ల్లో... 80 పతకాలు!
- ఆమె నగ... దేశదేశాలా ధగధగ
- ఆహార సేవకులు