మూడోవారి జోక్యం వద్దు..

ఇంట్లో భార్యభర్తలిద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలే ఒక్కోసారి పెద్దగా అవుతాయి.  తగాదా తీర్చమనో, మనసు భారం తీర్చుకోవడానికో స్నేహితులు, బంధువులను ఆశ్రయిస్తుంటారు.

Published : 30 Mar 2023 00:26 IST

ఇంట్లో భార్యభర్తలిద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలే ఒక్కోసారి పెద్దగా అవుతాయి.  తగాదా తీర్చమనో, మనసు భారం తీర్చుకోవడానికో స్నేహితులు, బంధువులను ఆశ్రయిస్తుంటారు. అసలు సమస్య అక్కడే మొదలవుతుందంటున్నారు నిపుణులు..

* ఏ విషయంలో గొడవ వచ్చినా అది పెద్దదయ్యే దాకా కొనసాగించొద్దు. ఇద్దరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలాకాకుండా భాగస్వాములిద్దరూ అరుచుకొని మధ్యలోకి ఇంకో వ్యక్తిని తీసుకొస్తే.. వాళ్లు ఏ ఒకరి వాదన విన్నా.. మరొకరి మనస్తత్వం అర్థం చేసుకోలేకపోయినా సమస్య సమసిపోకపోగా ఇంకా పెద్దదవుతుంది.

* ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఎంత పెద్ద వాదన అయినా తేలికగా కొలిక్కి వస్తుంది. చిన్న చిన్న విషయాలకే అపార్థం చేసుకుంటే బంధాలు తెగిపోతాయి. అభిప్రాయ భేదం వస్తే అవతలి వ్యక్తినే నేరుగా అడిగేయండి. అనుమానాలకు తావుండదు.

* అసలు గొడవ ఎవరి వల్ల జరిగినా వాదనకి దిగొద్దు. ముందుకొచ్చి అవతలి వ్యక్తికి క్షమాపణలు చెప్తే గొడవ అంతటితో సమసిపోతుంది.

* దంపతులిద్దరూ గిరిగీసుకొని కూర్చోకుండా బాధ్యతలు పంచుకుంటే పనులు తేలికవుతాయి. అలా కాకుండా నీ పని నా పని అంటూ అవతలి వ్యక్తికి ఆరోగ్యం బాగాలేకున్నా సహకరించకపోతే, సానుభూతి చూపించకపోతే బంధం బలహీనమైపోతుంది.

* ఎవరి హద్దులు వారికుంటాయి. ఏదో గొడవ ఒకసారి మూడో వ్యక్తి పరిష్కరించారని భాగస్వామికి ఇష్టం లేకపోయినా మధ్యలోకి వేరేవారిని తీసుకురాకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్