సెలవులు.. నేర్చుకునేలా!

పిల్లలకు సంక్రాంతి సెలవులొచ్చాయి. వీటినీ మామూలు వాటిల్లా టీవీ, వీడియో గేములు ఆడటానికే పరిమితం చేస్తే ఎలా? పండగ గురించి తెలియజేస్తూనే.. సృజనాత్మకతకు పనిచెప్పేలా చేయండిలా..

Published : 12 Jan 2023 00:47 IST

పిల్లలకు సంక్రాంతి సెలవులొచ్చాయి. వీటినీ మామూలు వాటిల్లా టీవీ, వీడియో గేములు ఆడటానికే పరిమితం చేస్తే ఎలా? పండగ గురించి తెలియజేస్తూనే.. సృజనాత్మకతకు పనిచెప్పేలా చేయండిలా..

* సంక్రాంతిని ప్రతిబింబించేలా బొమ్మలు గీయమనండి. చిన్నపిల్లలు.. తెలియదు అన్నారా.. ఫర్లేదు! భోగి మంటలు, సంక్రాంతి వేడుకలో కనిపించే భోగి కుండ, గాలిపటాలు, చెరకు గడలు, ముగ్గుల గురించి చెప్పి, గీయమనండి. మొబైల్‌, సిస్టమ్‌లో ఉదాహరణలు చూపిస్తే.. చక్కగా ప్రయత్నిస్తారు. ఊరికే వాళ్లకి మాత్రం ఏం ఆసక్తి ఉంటుంది? అందంగా గీస్తే వాటిని ఇంట్లో అలంకరిద్దామని చెప్పండి.. ఉత్సాహంగా ప్రయత్నిస్తారు.

* కొంచెం పెద్ద పిల్లలనుకోండి.. అట్టపెట్టలు, క్లే, పేపర్లతో క్రాఫ్ట్‌లు చేయమనండి. సొంతంగా గాలి పటాలనూ ప్రయత్నించమనొచ్చు. పూలు, రంగుల కాగితాలతో గుమ్మాలను అలంకరించడం వంటివీ చెప్పొచ్చు. అవి ఎలా ఉన్నా.. మీరు నవ్వద్దు, ఏమీ వ్యాఖ్యానించొద్దు. అప్పుడే వాళ్లకీ ఆనందం.. ఇంకోసారి భిన్నంగా ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతారు. కావాలంటే.. ‘ఇది బాగుంది.. ఇంకొంచెం అందంగా చేద్దా’మని మీ ఆలోచనలనీ జోడిస్తే కలిసి చేయడం తెలుస్తుంది. దాన్ని ఇంట్లో అందరికీ కనిపించే చోట పెడితే సరి.

* పండగంటేనే పిండి వంటలు.. ఎంతసేపూ మీరు చేయడమేనా! ఈసారి వాళ్లకీ అవకాశ మివ్వండి. పెద్దవే అవసరం లేదు. లడ్డూలు చుట్టడం, ఉండలు చేయడం.. లాంటి చిన్న చిన్న పనులు అప్పగించండి. పనిలో ఉన్న కష్టం తెలుస్తుంది. తీరా వాళ్లు చేసింది నచ్చలేదు అంటే ఎంత బాధో అర్థమవుతుంది. తినేటప్పుడు పేచీలు పెట్టకూడదన్నదీ గమనిస్తారు.

* స్నేహితులకు పండగ శుభాకాంక్షలు చెబుతాం. పిల్లల్నీ ప్రోత్సహించండి. అయితే ఫోను, మెసేజ్‌లకే పరిమితం చేయొద్దు. రంగుల కాగితాలిచ్చి చిన్న ముగ్గులు, బొమ్మలతో శుభాకాంక్షలు రాసి, చిన్న చిన్న గ్రీటింగులు చేయమనండి. వాటిని వాళ్లతోనే ఇప్పించండి.. ఇచ్చిన పిల్లలకీ, అందుకున్న వాళ్లకీ ఓ అందమైన జ్ఞాపకమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్