ఆడపడుచుతో స్నేహం..

నూతనవధువు అత్తారింట అడుగుపెట్టేటప్పుడు లోలోపల భయం సహజం. ఆ ఇంటి వాతావరణం కొత్త అనిపిస్తుంది. త్వరగా అత్తింటిలో అలవాటు పడటానికి ఆడపడుచుతో అయ్యే పరిచయమే చేదోడు అవుతుంది.

Published : 30 Dec 2022 00:36 IST

నూతనవధువు అత్తారింట అడుగుపెట్టేటప్పుడు లోలోపల భయం సహజం. ఆ ఇంటి వాతావరణం కొత్త అనిపిస్తుంది. త్వరగా అత్తింటిలో అలవాటు పడటానికి ఆడపడుచుతో అయ్యే పరిచయమే చేదోడు అవుతుంది.

త్తింటిలో అడుగుపెట్టే కొత్తపెళ్లి కూతురికి ఆందోళనతోపాటు పుట్టింటిపై బెంగ తోడవుతుంది. ఇటువంటి ఒంటరితనంలో మనసుకు దగ్గరగా ఒక స్నేహితురాలుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఆయా ప్రాంతాలకు తగినట్లుగా సంస్కృతి, సంప్రదాయాలుంటాయి. భర్త తరఫు కుటుంబానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే అత్తామామలను అడగడం సబబు కాదు. అదే ఆ ఇంట ఆడపడుచు ఉంటే తెలుసుకోవచ్చు. ఆమెతో చేసే అరమరికల్లేని స్నేహమే.. భవిష్యత్తులో అత్తింటితో విడదీయలేని అనుబంధాన్ని పెంచుతుంది. ఆమెను పరిచయం చేసుకొన్నప్పుడే మనసుకు దగ్గరవ్వబోయే స్నేహితురాలిగా భావిస్తే చాలు. అత్తింట అందరి మనసుల్లోనూ మంచి స్థానం సంపాదించొచ్చు.

ఆ బంధం.. దాదాపు సమవయస్కురాలైన ఆడపడుచుతో స్నేహం చేయడం మొదలుపెడితే మంచి స్నేహితురాలు దొరికినట్లే. తన అభిరుచులు, ఆశయాలను తెలుసుకోవాలి. ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. అత్తింటిలో ప్రత్యేక సందర్భాలను అడిగి తెలుసుకొని ఈ సారి వాటినెలా ప్లాన్‌ చేద్దామని చర్చించాలి. మీ మనసులోని విషయాలనూ తనతో పంచుకోగలిగితే  నెమ్మదిగా ఆమె కూడా తన స్నేహ హస్తాన్ని అందిస్తుంది.

ప్రేమగా.. తనతో మనస్ఫూర్తిగా చేసే స్నేహం ఇరువురిమధ్య కొత్తబంధాన్ని పెనవేస్తుంది. ఆమె సమస్యలకు మీదైన సలహాలిచ్చి పరిష్కరించొచ్చు. అయితే, తనలో నచ్చనివి కనిపించినప్పుడు వెంటనే వాటిని తక్కువగా మాట్లాడితే బంధం బెడిసికొడుతుంది. కొన్నిసార్లు సహనంగా సర్దుకుపోవాలి. అప్పుడే సంసారమనే కొత్త ప్రయాణం సజావుగా సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్