మాటే మంత్రమవ్వాలి!

పెళ్లయిన కొత్తల్లో చిన్న చిన్న గిల్లికజ్జాలు జరిగితే పెద్దలు ‘ఇవన్నీ సహజం. రాను రానూ సర్దుకుంటాయి’ అన్న సలహా ఇస్తారు. నిజమే కాలం గడిచేకొద్దీ ఒకరిపై మరొకరికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అది సానుకూలంగా, ప్రేమబంధంగా మారాలంటే ‘మాట’కు ప్రాధాన్యమివ్వాలంటారు నిపుణులు.

Published : 22 Dec 2022 00:31 IST

పెళ్లయిన కొత్తల్లో చిన్న చిన్న గిల్లికజ్జాలు జరిగితే పెద్దలు ‘ఇవన్నీ సహజం. రాను రానూ సర్దుకుంటాయి’ అన్న సలహా ఇస్తారు. నిజమే కాలం గడిచేకొద్దీ ఒకరిపై మరొకరికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అది సానుకూలంగా, ప్రేమబంధంగా మారాలంటే ‘మాట’కు ప్రాధాన్యమివ్వాలంటారు నిపుణులు.

* చిన్న సాయాలు, గుర్తుంచుకొని మీకోసమంటూ ప్రత్యేకంగా ఏదైనా తెచ్చినప్పుడు ఆనందించడం, ‘థాంక్యూ’ చెప్పడం సహజమే! ఒక అడుగు ముందుకేసి దాన్ని చూడగానే మీకనిపించిన అనుభూతిని మాటల్లో చెప్పండి. అందుకున్న మీకే కాదు.. అదాయనకీ మధురానుభూతిగా మారుతుందా క్షణం.

* భాగస్వామిలో నచ్చేవీ, నచ్చనివీ రెండూ ఉంటాయి. ‘నాకు ఫలానాది చేస్తే నచ్చుతుంది/ నచ్చదు’ అని చెబుతుంటారు కదా! ఎందుకు నచ్చుతుందో? ఎందుకు నచ్చదో వివరంగా చెప్పండి. మంచిదైతే అభివృద్ధి పరచుకుంటారు. కాదనుకుంటే మారడానికి ప్రయత్నిస్తారు. రెండూ మంచివేగా!

* సంతోషాన్నిచ్చిన సందర్భం ఉంది.. మీకు సంతోషం కలిగించిందేదో చెప్పండి. పోనీ అవతలి వ్యక్తి మీరు చేసిన దానికి థాంక్యూ చెప్పారనుకోండి. వారికి సాయం చేయడంలో మీకష్టం చెప్పండి. కృతజ్ఞతగా ఉంటారు. నచ్చకపోయినా చేశారా.. దాన్నీ పంచుకోండి. లేదూ తనకి సాయం చేయడంలో మీకు సంతృప్తి ఉంటే చెప్పండి. మీ తీరేదో అర్థమవుతుంది.

* అందరూ అన్నీ చెప్పలేరు. ఎంతసేపూ మీరు చెప్పడమే కాదు.. అవతలి వారి ఆసక్తులు, ఇష్టాయిష్టాలనూ కనుక్కోండి. అప్పుడు వాళ్లూ నోరుతెరుస్తారు. అభిప్రాయాలను చెబుతారు. సంతోషం, దుఃఖం గురించి పంచుకుంటారు. ఇవన్నీ భార్యాభర్తల మధ్య సహజంగా జరిగేవే.. చిరునవ్వు, కోపం, అలక, చిన్నమాటకు బదులు వివరంగా భాగస్వామి ముందుంచుతున్నారంతే! మాట అనే ఈ చిన్న మంత్రాన్ని పాటించి చూడండి.. మీరు కోరుకున్న విధంగా జీవితం సాగుతూనే.. బంధం బలపడటాన్ని స్పష్టంగా గమనిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్