అబద్ధాన్ని అడ్డుకోండిలా....

పసిపిల్లలే కదా అని వాళ్లు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను చూసీ చూడనట్లు వదలద్దు. వాటిని నలుగురిలో మురిపెంగా చెప్పడం అసలే వద్దు. ఆ అలవాటుకు ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేయండి.

Published : 22 Dec 2022 00:31 IST

పసిపిల్లలే కదా అని వాళ్లు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను చూసీ చూడనట్లు వదలద్దు. వాటిని నలుగురిలో మురిపెంగా చెప్పడం అసలే వద్దు. ఆ అలవాటుకు ఈ చిట్కాలతో అడ్డుకట్ట వేయండి.

* ఆత్మవిశ్వాసం లోపించడమే అబద్ధాలకు ప్రధాన కారణం. పిల్లల ప్రవర్తనలో అలాంటి సంకేతం కనిపిస్తే... వాళ్లతో ఓ సారి మాట్లాడండి. నిజాన్ని మాట్లాడటం, నిజాయతీగా ఉండటం వల్ల ఎలాంటి గౌరవం ఉంటుందో వివరించండి. ముందు ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో నేర్పించండి. పిల్లల్లో మార్పు కనిపించే కొద్దీ ప్రోత్సహిస్తే అబద్ధాలకు దూరంగా ఉంటారు.

* కొందరు పిల్లలు కారణం లేకుండానే చటుక్కున అబద్ధాలు ఆడేస్తుంటారు. దాన్ని గుర్తిస్తే తిట్టడం, కొట్టడం చేయద్దు. అబద్ధాల వల్ల ఎదురయ్యే సమస్యల్ని వివరించండి. ఎంత గోడకట్టినట్టు అబద్ధం చెప్పినా సరే... ఏదో ఒకరోజు అందుకు శిక్ష అనుభవించాల్సిందే అన్నది హత్తుకునేలా చెప్పండి.

* చిన్నారులు అబద్ధాలు చెప్పకూడదంటే ముందు... మనమూ పాటించాలి. అలానే, ఏ విషయంలో అయినా పొరపాటు జరిగితే దాన్ని నిజాయతీగా ఒప్పుకుని.. సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. కచ్చితంగా మీ చిన్నారులు కూడా దాన్ని నేర్చుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్