అడిగింది ఇవ్వకపోతే...

రమ కొడుక్కి ఏడేళ్లు. ల్యాప్‌టాప్‌ కావాల్సివచ్చినా.. వెంటనే ఇచ్చేయాలి. లేదంటే దాన్ని లాక్కొని విరగ్గొట్టేవరకు ఆగడు. ఆ తర్వాత అమ్మ విధించిన ఏ శిక్షనైనా స్వీకరిస్తాడు.

Updated : 08 Feb 2023 14:46 IST

రమ కొడుక్కి ఏడేళ్లు. ల్యాప్‌టాప్‌ కావాల్సివచ్చినా.. వెంటనే ఇచ్చేయాలి. లేదంటే దాన్ని లాక్కొని విరగ్గొట్టేవరకు ఆగడు. ఆ తర్వాత అమ్మ విధించిన ఏ శిక్షనైనా స్వీకరిస్తాడు. ఈ తరహా భావోద్వేగపూరితమైన ప్రవర్తనను బాల్యం నుంచే తగ్గించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. 

పిల్లల్లో ఈ రకమైన ప్రవర్తన కనిపించినప్పుడు దాన్ని పరిష్కరించాలి తప్ప, ఆ లక్షణాన్ని ముద్దుగా మొండితనమంటూ.. వదిలేయకూడదు. కోరిందివ్వకపోతే వాడలాగే చేస్తాడు, మొండితనమెక్కువ అనే పదాలను తన విషయంలో నిజమేనేమో అనుకుంటాడా చిన్నారి. అలాగే కొనసాగించడం మొదలుపెడతాడు. క్రమేపీ దాన్నే వ్యక్తిత్వంగా మార్చుకుంటాడు. మొదట్లోనే పిల్లల సమస్యను గుర్తించి పరిష్కరించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. అడిగిందివ్వకపోతే లాక్కొంటాడు.. పగలగొడతాడు, వెంటనే వాడికిచ్చేయ్‌ వంటి మాటలతో పెద్దవాళ్లు తమకు తెలియకుండానే పిల్లలను ప్రోత్సహిస్తారు. అలాకాకుండా పిల్లలెందుకిలా ప్రవర్తిస్తున్నారో గుర్తించాలి. ఇంట్లో మరెవరికైనా ఆ ప్రవర్తన ఉందేమో చూడాలి. వారిని అనుసరించి చిన్నారులు కూడా తాము అనుకున్నది సాధించడానికి అలా చేస్తుండొచ్చు. సమస్య ఎక్కడుందో తెలుసుకొని పరిష్కరించాలి. 

ఒత్తిడితో.. తన మాటను ఎదుటివారు వినడంలేదనో. తనకన్నా చిన్నవాడిని ఎక్కువగా ప్రేమిస్తూ బొమ్మలువంటివి వారికి ఇస్తున్నారనే ఒత్తిడి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. వారి మనసులోని భావోద్వేగాలపై వారికే అవగాహన ఉండదు. అది ప్రవర్తన ద్వారా బయటపెడుతుంటారు. తన స్థానం తక్కువగా ఉందని, తననెవరూ ప్రేమించడం లేదనే అపోహ చిన్నారుల్లో ఎక్కువగా ఉంటుంది. కొందరు పిల్లలు ఫోన్‌కు దూరంగా ఉండమని, లేదంటే హోంవర్క్‌ పూర్తిచేస్తేనే గేమ్స్‌ ఆడాలనే షరతులకు కూడా ఆందోళనకు గురవుతారు. ఈ రకమైన ప్రవర్తనను వెంటనే గుర్తించి ఆ చిన్నారి మనసులోని ఒత్తిడిని దూరం చేయడానికి కృషి చేయాలి. మృదువుగా చెప్పి మార్చాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్