బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి.
ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. మరి, ఇలా జరగకుండా అనుబంధాన్ని నిలుపుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..
కారణాలను వెతకండి...
కొంతమంది మహిళలు ‘నా భార్త చాలా బద్ధకస్తుడు, ఏ పనిలో సహాయం చేయడు. ఆయనతో విసిగిపోతున్నాను’ అని నిట్టూరుస్తుంటారు. అయితే దీనికంటే ముందు అతని బద్ధకానికి గల అసలు కారణాలను వెతికే ప్రయత్నం చేయండి. ఇందుకోసం ఇద్దరూ కూర్చొని మీ సమస్యలను అంశాల వారీగా చర్చించుకోండి. కొన్ని సందర్భాల్లో ఆఫీసులో ఉండే ఒత్తిళ్ల వల్ల ఇంటి దగ్గర బద్ధకంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి, ముందు కారణాన్ని వెతికి దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి.
‘సూపర్ హీరో’ను చేయండి..!
‘నా భర్త ఇవతలి గిన్నె తీసి అవతల పెట్టడు’ అని కొంతమంది మహిళలు వాపోతుంటారు. ఇలాంటి వారికి రివర్స్ సైకాలజీని అప్లై చేయాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా వారికి కొన్ని రకాల పనులు అప్పగించండి. ‘ఈ పనులు మీరు మాత్రమే చేయగలుగుతారు’ అని వారిని ప్రోత్సహిస్తూనే.. వారికి ‘సూపర్ హీరో’ టైటిల్ ఇవ్వండి. అయితే అన్ని సందర్భాల్లో మీ భర్త అవసరం మీకు ఉండకపోవచ్చు. కానీ, అవసరం లేకున్నా క్రమంగా ఆ పనులను వారికే అప్పగించడం ద్వారా వారు వాటిని తమ బాధ్యతగా భావించే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఆ పనులు చేయడం ద్వారా మీరు, పిల్లలు ఎంత ఆనందపడుతున్నారో వారికి తెలియజేయండి. దాంతో వారు తమకిచ్చిన ‘సూపర్ హీరో’ ఇమేజ్ను కాపాడుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఆ పనిని క్రమం తప్పకుండా చేసేందుకు ఆరాటపడడం ఖాయం!
మీరే కారణమా?
కొంతమంది మహిళలు తమకు తాము సూపర్ ఉమన్‌గా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో పని చేయడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని.. ఇలా అన్ని రకాల పనులను భర్త సహకారం లేకుండా ఒక్కరే పూర్తి చేసుకుంటారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది భర్తలు ‘ఎలాగూ పనులన్నీ తనే చేసుకుంటుంది కదా!’ అని విశ్రాంతి తీసుకుంటారు. దీనివల్ల క్రమంగా బద్ధకం వచ్చేస్తుంటుంది. మీరు కూడా అన్ని సందర్భాల్లో అన్ని పనులూ పూర్తి చేయలేరు. ఇలాంటప్పుడే అసలు సమస్య వస్తుంది. కాబట్టి, మీకు అన్ని పనులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్ని పనులను మీ భర్తకు అప్పగించడం మంచిది. తద్వారా మీకూ కాస్త సమయం దొరుకుతుంది. మీ భర్తా బద్ధకాన్ని పక్కన పెట్టి బాధ్యతగా వ్యవహరిస్తారు.
అభినందించండి...
చేసిన పనికి ప్రశంసలు దక్కితే వారు తమ పనిని మరింత ఉత్సాహంగా చేస్తుంటారు. భర్తల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కానీ, కొంతమంది వారు చేసిన పనిలో తప్పులు వెతుకుతుంటారు. దీనివల్ల వారు చేసే పనుల్ని కూడా పక్కన పెట్టే అవకాశాలూ లేకపోలేదు. అందుకే పేచీ పెట్టుకోవడానికి బదులుగా వారు చేసిన పనిని ప్రశంసించడం లేదా వారికి ప్రేమతో ఓ కానుకివ్వడం.. వంటివి చేయడం వల్ల వారు సంతృప్తి పడడంతో పాటు మీకు మరింతగా సహాయం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.
ఇలా చేయకండి...
కొంతమంది ఒకే పని గురించి వందసార్లు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తి చిరాకు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఒకవేళ వాళ్లు పని గురించి మర్చిపోయినా సాధ్యమైనంత వరకు వారికి నెమ్మదిగా గుర్తు చేసే ప్రయత్నం చేయండి. అలాగే అతను చేసే పనిలో ఏదైనా ఇబ్బంది పడుతుంటే మీ వంతుగా సహాయం అందించండి. దీనివల్ల అతని పట్ల మీకున్న శ్రద్ధ తెలుస్తుంది.
ఆడుతూ పాడుతూ...
మారుతున్న జీవనశైలిలో భాగంగా ప్రతి ఒక్కరూ బిజీగా గడుపుతున్నారు. దాంతో భార్యభర్తల మధ్య మాట్లాడుకునే సమయం కూడా తగ్గుతుంది. కాబట్టి, ఏ పనైనా ఇద్దరూ పంచుకొని చేయండి. ఈ సమయంలో మనసులోని మాటల్ని పంచుకోండి. ఫలితంగా పని త్వరగా పూర్తవ్వడమే కాదు.. ఇద్దరూ కలిసి ఇలా సమయం గడపడం వల్ల మీ దాంపత్య బంధమూ బలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- నా ఉత్తరాలు చూసి.. కన్నీళ్లతో హత్తుకున్నారు.. తీరు మార్చుకున్నారు!
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- ఏడిపిస్తోంటే... ప్రేమంటున్నారు!
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!