Donald Trump: ‘ప్రేమలేఖ’తో ట్రంప్ విరాళాల సేకరణ..!

Donald Trump: తన భార్య మెలానియాకు రాసిన ప్రేమలేఖను ట్రంప్‌ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకున్నారు. ఆ లేఖతో విరాళాలు సేకరించారు.

Published : 15 Feb 2024 19:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికా (USA) అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారు. తాజాగా తన భార్య మెలానియాకు రాసిన ప్రేమలేఖతో ఆయన మద్దతుదారులను విరాళాలు అడిగారు.

ప్రేమికుల దినోత్సవం (Valentine's Day) సందర్భంగా మెలానియాకు రాసిన లేఖను ట్రంప్‌ తన ఫండ్‌ రైసింగ్‌ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘డియర్‌ మెలానియా. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నాపై నేరాభియోగాలు వచ్చినా.. నన్ను అరెస్టు చేసినా.. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా.. నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. కష్ట సమయంలో నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచావు. నీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నువ్వే నా ప్రపంచం - ప్రేమతో నీ భర్త డొనాల్డ్‌ ట్రంప్‌’’ అని అందులో రాసుకొచ్చారు. దీన్ని వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసిన ట్రంప్‌.. ‘‘ఇది నా భార్యకు రాసిన వాలెంటైన్‌ డే లేఖ. మీరు కూడా నాపై మీ ప్రేమను కురిపించండి’’ అంటూ విరాళాలు కోరారు.

మాంద్యంలోకి యూకే.. ఎన్నికల ముందు సునాక్‌కు షాక్‌

మరోవైపు రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌నకు ప్రధాన ప్రత్యర్థి నిక్కీ హేలీ.. వాలెంటైన్స్‌ డే సందర్భంగా ట్రంప్‌ను విమర్శిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘నాకు డిక్టేటర్స్‌ అంటే ఇష్టం. వారికి కూడా నేనంటే ప్రేమే. ఈ ప్రపంచంలో ఉన్న నియంతలందరికీ ట్రంప్‌ తరఫునుంచి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని