లాక్‌డౌన్‌లో లండన్‌.. పార్టీల్లో ప్రధాని

ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మందు పార్టీలో పాల్గొన్న అంశం మరోసారి ..

Published : 12 Jan 2022 10:31 IST

నిబంధనలు ఉల్లంఘించిన బోరిస్‌ జాన్సన్‌

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మందు పార్టీలో పాల్గొన్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2020 మే నెలలో దేశమంతా లాక్‌డౌన్‌ అమలవుతున్న సమయంలో.. బోరిస్, ఆయన భార్య క్యారీతో కలిసి డౌనింగ్‌ స్ట్రీట్‌లో పార్టీలో పాల్గొన్నట్టు ఆధారాలు లభించాయని బీబీసీ పేర్కొంది. బ్రింగ్‌ యువర్‌ ఓన్‌ బూజ్‌ (మీ సొంత మద్యం తీసుకురండి) అన్న పేరుతో మే 20న ప్రభుత్వ కార్యాలయంలోనే నిర్వహించిన ఈ పార్టీకి 100 మందికి ఈమెయిల్‌ ఆహ్వానాలు అందాయని, ప్రధాని దంపతులు కూడా హాజరయ్యారని బీబీసీ వెల్లడించింది. అంతకు ఐదు రోజుల ముందు మే 15న ఇదే తరహా పార్టీలో బోరిస్‌ దంపతులు, ప్రధాని కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారని ‘గార్డియన్‌’ పత్రిక ఇదివరకే బహిర్గతం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని