త్వరలో బైడెన్‌ సర్కారుకు జాన్‌ కెర్రీ గుడ్‌బై!

వాతావరణ అంశంపై అమెరికా ప్రత్యేక దూత జాన్‌ కెర్రీ.. తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులు తాజాగా ఈ విషయాన్ని తెలియజేశారు. సెనెటర్‌గా, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

Updated : 15 Jan 2024 04:52 IST

వాషింగ్టన్‌: వాతావరణ అంశంపై అమెరికా ప్రత్యేక దూత జాన్‌ కెర్రీ.. తన పదవి నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులు తాజాగా ఈ విషయాన్ని తెలియజేశారు. సెనెటర్‌గా, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2020 నవంబరులో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్‌.. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వ వాణిని వినిపించడానికి కెర్రీని ఎంపిక చేసుకున్నారు. 2015లో కుదిరిన ‘పారిస్‌ ఒప్పంద’ ముసాయిదా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. నాడు ఆయన ఒబామా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. సెనెట్‌ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా దాదాపు దశాబ్దాల పాటు సేవలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని