Nikki Haley: ప్రత్యర్థులు లేరు.. అయినా ఓడిన నిక్కీహేలీ..!

రిపబ్లికన్‌ పార్టీ తరఫున నెవడా ప్రైమరీలో పోటీ చేసిన భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ(Nikki Haley)కి ఎదురుదెబ్బ తగలింది. 

Published : 07 Feb 2024 13:55 IST

వాషింగ్టన్‌: ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం రాష్ట్రాల వారీగా ప్రైమరీలు జరుగుతున్నాయి. తాజాగా నెవడాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రైమరీలో నిక్కీహేలీ(Nikki Haley)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యర్థులు ఎవరూ లేకపోయినా..ఓటర్లు ఆమెకు షాకిచ్చారు. ‘నన్‌ ఆఫ్‌ దీజ్‌ కాండిడేట్స్‌’ మీట నొక్కి ఆమెను తిరస్కరించారు. అంటే మనదగ్గర నోటా లెక్క.

నన్‌ ఆఫ్‌ దీజ్‌ కాండిడేట్స్‌కు 61 శాతం ఓట్లు పోలవ్వగా.. నిక్కీకి 32 శాతం ఓట్లు వచ్చాయి. నెవడాలో ప్రధాన పోటీదారైన ఆమెను  ఓటర్లు ఈ రకంగా ఓడించారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 6న డెమోక్రట్‌, రిపబ్లికన్‌ పార్టీలకు ప్రైమరీలు జరిగాయి. డెమోక్రట్ల తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌(Joe Biden) విజయం సాధించారు. రిపబ్లికన్ల తరఫున ప్రైమరీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌(Trump) బరిలో నిల్చొలేదు. కేవలం నిక్కీ(Nikki Haley) మాత్రమే పోటీ చేశారు.

నిక్కీ(Nikki Haley)కి ఇది బ్యాడ్‌ నైట్ అని ట్రంప్‌ ఎద్దేవా చేశారు. 30 శాతం ఓట్లను ‘నన్‌ ఆఫ్‌ దీజ్‌ కాండిడేట్స్‌’కు కోల్పోయారని విమర్శించారు. మొత్తంగా ప్రైమరీల్లో ఆమెకు ఇది మూడో ఓటమి. వరుస విజయాలతో ట్రంప్‌ దూకుడు మీద ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని