Jinping: ‘ఈ యువకుడెవరో తెలుసా?’.. జిన్‌పింగ్‌ 38 ఏళ్ల క్రితం నాటి ఫొటో వైరల్‌

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ 38 ఏళ్ల క్రితం అమెరికాలో దిగిన ఓ ఫొటో వైరల్‌గా మారింది.

Updated : 18 Nov 2023 16:57 IST

వాషింగ్టన్‌: చైనా అధినేత జిన్‌పింగ్‌ (Xi Jinping) అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), జిన్‌పింగ్‌ల మధ్య ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ కార్యక్రమంలో బైడెన్‌ తన ఫోన్‌లో ఓ వ్యక్తి ఫొటో చూపెడుతూ.. ఈ యువకుడు ఎవరో గుర్తుపట్టండంటూ జిన్‌పింగ్‌ను అడిగారు. ఆ చిత్రాన్ని చూడగానే జిన్‌పింగ్‌ నవ్వులు చిందించారు. కారణం.. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఆయనే కావడం..! 38 ఏళ్ల క్రితం అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌ (Golden Gate Bridge) వద్ద దిగిన ఫొటోగా గుర్తుపట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

మా మేడ్‌ ఇన్‌ చైనా కారును చూడండి

ఇరు నేతల మధ్య జరిగిన సంభాషణపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఈ ఫొటోలో ఉన్నది ఎవరో మీకు తెలుసా? అని జిన్‌పింగ్‌ను బైడెన్‌ అడిగారు. ‘ఓ యస్‌’ అంటూ చైనా అధినేత బదులిచ్చారు. అది 38 ఏళ్ల క్రితం నాటి ఫొటోగా చెప్పారు’’ అని చున్‌యింగ్‌ పేర్కొన్నారు. నెటిజన్లు సైతం పాత ఫొటోలో జిన్‌పింగ్‌ బాగున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇరునేతల మధ్య సమన్వయం, అవగాహన.. ప్రపంచానికి మేలు చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తంచేశారు. తమ తమ వాహనాల విషయంలోనూ బైడెన్‌, జిన్‌పింగ్‌ల సంభాషణ జరిగిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని