London: భారత ప్రభుత్వం ప్రతిచర్య.. లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే(UK) ప్రభుత్వ ఉదాసీనత పట్ల భారత్‌ ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలో దౌత్యకార్యాలయం వద్ద యూకే ప్రభుత్వం భద్రతను పెంచింది. 

Published : 22 Mar 2023 19:43 IST

(పాత చిత్రం)

లండన్‌: లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టమైంది. బారీకేడ్ల సంఖ్య పెరిగడంతో పాటు భద్రతాధికారుల సంఖ్య పెరిగింది. సెంట్రల్‌ లండన్‌లోని ఇండియా ప్లేస్‌గా పిలిచే ప్రాంతంలో ఉన్న ఈ భవనం వద్ద వారంతా విధుల్లో కనిపించారు. దిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లో ఉన్న బ్రిటన్‌ హైకమిషన్‌ (UK High commission) కార్యాలయం బయట బారికేడ్లను తొలగించిన మరుక్షణమే యూకే ప్రభుత్వం నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. 

లండన్‌లోని భారత హైకమిషన్‌పై ఖలిస్థాన్‌ (Khalistan) మద్దతుదారులు చేసిన దుశ్చర్యను భారత్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంపై దిల్లీలోని బ్రిటన్‌ సీనియర్‌ దౌత్యవేత్తకు సమన్లు కూడా జారీ చేసింది. నిరసనకారులు భారత హైకమిషన్‌కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అలాగే బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం వద్ద బారీకేడ్లను తొలగించింది. అయితే భద్రతా సిబ్బందిని మాత్రం తగ్గించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని