చట్టబద్ధ పాలన ఉన్న దేశం మాది

కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు.

Published : 06 May 2024 04:22 IST

భారతీయుల అరెస్టు నేపథ్యంలో కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్య

టొరంటో: కెనడా.. చట్టబద్ధ పాలన ఉన్న దేశమని ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో శనివారం పేర్కొన్నారు. తమ దేశంలో బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందని, పౌరులను రక్షించడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌కు చెందిన కరణ్‌ప్రీత్‌ సింగ్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ బ్రార్‌ను ఇటీవల కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ట్రూడో పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. కెనడాలో ఉన్న ప్రతి వ్యక్తికి భద్రతతో జీవించే హక్కు ఉందన్నారు. వివక్షాపూరిత, హింసాయుత వాతావరణం నుంచి రక్షణ పొందడం వారి హక్కు అని వ్యాఖ్యానించారు. నిజ్జర్‌ మృతి తర్వాత కెనడాలోని సిక్కు వర్గం అభద్రతా భావంతో జీవిస్తోందని ట్రూడో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని