హమాస్‌తో తాజా చర్చలు విఫలం?

ఇజ్రాయెల్‌తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్‌ ఆదివారం ప్రకటించింది.

Published : 06 May 2024 04:21 IST

అతిత్వరలో దాడులు తప్పవన్న ఇజ్రాయెల్‌

జెరూసలెం: ఇజ్రాయెల్‌తో ఈజిప్టులోని కైరోలో తాజాగా జరిపిన కీలక చర్చలు ముగిశాయని హమాస్‌ ఆదివారం ప్రకటించింది. చర్చల అనంతరం హమాస్‌ ప్రతినిధులు ఖతార్‌ వెళ్లిపోయారు. గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాల ఉపసంహరణ, యుద్ధం ముగింపులాంటి హమాస్‌ కీలక డిమాండ్లను నెతన్యాహు సర్కారు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో చర్చలు విజయవంతం కాలేదని అనధికార వార్తల్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఫాతో పాటు గాజాలోని ఇతర ప్రాంతాల్లో అతిత్వరలో భారీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని