అల్‌-జజీరాపై నిషేధం

హమాస్‌కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్‌-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్‌పై ఆదివారం ఇజ్రాయెల్‌ నిషేధం విధించింది.

Published : 06 May 2024 04:22 IST

టెల్‌ అవీవ్‌: హమాస్‌కు అనుకూలంగా.. పక్షపాతంతో వార్తలను ప్రసారం చేస్తోందన్న అభియోగాలతో అల్‌-జజీరా అంతర్జాతీయ వార్తా ఛానల్‌పై ఆదివారం ఇజ్రాయెల్‌ నిషేధం విధించింది. ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలో మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానానికి గత నెల ఒకటో తేదీనే ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది. నిషేధాన్ని అల్‌-జజీరా ఖండించింది. మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. న్యాయపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఈ నిషేధ ఉత్తర్వులను సవాల్‌ చేస్తామని తెలిపింది. ఓవైపు కాల్పుల విరమణపై హమాస్‌-ఇజ్రాయెల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న కీలక సమయంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. చర్చల్లో అమెరికా, ఈజిప్టుతో పాటు ఖతార్‌ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. అల్‌-జజీరా ఛానల్‌ ఖతార్‌ ప్రభుత్వానికి చెందినది. మంత్రి మండలి తీర్మానంతో అల్‌-జజీరా ఛానల్‌ పరికరాలను ఇజ్రాయెల్‌ అధికారులు జప్తు చేయొచ్చు. ఇజ్రాయెల్‌లో టీవీ ప్రసారాలను నిలిపివేయొచ్చు. వెబ్‌సైట్లను కూడా బ్లాక్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని