టెక్సాస్‌ను ముంచెత్తుతున్న వరదలు

భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు.

Published : 06 May 2024 06:10 IST

హ్యూస్టన్‌: భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని శనివారం వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక మంది ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు 400 మందిని సహాయక చర్యల సిబ్బంది రక్షించారని అధికార వర్గాలు వెల్లడించాయి. వర్షాలు మరింత ఎక్కువగా కురిసే ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని