NATO: నాటోలో చేరిన ఫిన్లాండ్.. యుద్ధం వేళ పుతిన్‌కు ఎదురుదెబ్బ!
ఫిన్లాండ్‌కు అధికారికంగా ‘నాటో’ సభ్యత్వం దక్కింది. ఫలితంగా.. నాటో దేశాలతో రష్యా సరిహద్దు దాదాపు రెట్టింపు అయ్యింది. ఫిన్లాండ్‌లో ఏం జరుగుతుందో నిశితంగా గమనిస్తున్నామని, దాని ఆధారంగానే అవసరమైన చర్యలు తీసుకుంటామని క్రెమ్లిన్ స్పందించింది.
బ్రసెల్స్: నాటో (NATO) కూటమిలో 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ (Finland) అవతరించింది. అమెరికా (America), ఫిన్లాండ్ విదేశాంగ మంత్రులు ఈ మేరకు అధికారిక పత్రాన్ని మార్చుకున్నారు. దీంతో నాటోలో ఫిన్లాండ్ అధికారికంగా చేరినట్లయ్యింది. నాటో విస్తరణను మొదటినుంచి వ్యతిరేకిస్తోన్న రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin)కు.. తాజా పరిణామంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రష్యాతో ఫిన్లాండ్ 1340 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉంది. తాజా చేరికతో.. నాటో దేశాలతో రష్యా సరిహద్దు దాదాపు రెట్టింపు అయ్యింది.
మరోవైపు.. నాటో విస్తరణను రష్యా భద్రత, జాతీయ ప్రయోజనాల ఉల్లంఘనగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ అభివర్ణించారు. ఫిన్లాండ్‌లో ఏం జరుగుతోందో నిశితంగా గమనిస్తున్నామని, దాని ఆధారంగానే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఫిన్లాండ్, స్వీడన్‌లు సైనికపరంగా తటస్థ వైఖరిని అవలంబించినా.. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు నాటో దిశగా అడుగులు వేశాయి. గత ఏడాది మేలో ఈమేరకు దరఖాస్తు చేసుకోగా.. ఏడాది లోపే ఫిన్లాండ్ చేరిక ప్రక్రియ పూర్తయింది. స్వీడన్ విషయంలో తుర్కియే, హంగరీలు పచ్చజెండా ఊపాల్సి ఉంది. ఫిన్లాండ్ చేరికపైనా గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన తుర్కియే.. ఇటీవల సానుకూలత వ్యక్తం చేయడంతో ఆ దేశానికి మార్గం సుగమమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
Guntur: తెదేపా ‘మోత మోగిద్దాం’లో పాల్గొన్న వారిపై కేసు
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి