8వ తరగతి వరకు టీసీలు అవసరం లేదు
close

ప్రధానాంశాలు

8వ తరగతి వరకు టీసీలు అవసరం లేదు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో బడికి మారేందుకు 8వ తరగతి వరకు బదిలీ ధ్రువపత్రం (టీసీ) అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన స్పష్టంచేశారు. ఆమె మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. మరో పాఠశాలకు బదిలీ అయ్యేందుకు ప్రైవేట్‌ యాజమాన్యాలు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె దృష్టికి తీసుకురాగా.. విద్యాహక్కు చట్టంలోనే టీసీ అవసరం లేదని స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆయా జిల్లాల్లోని డీఈఓలను సంప్రదించాలని, కొత్త పాఠశాలలో ఛైల్డ్‌ ఇన్ఫో డేటాలో పేరు నమోదయ్యేలా చూడాలని ఆమె సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని