మళ్లీ నురగెత్తిన గోదారి

ప్రధానాంశాలు

మళ్లీ నురగెత్తిన గోదారి

కాలుష్యమే కారణమని జనం ఆందోళన

గోదావరిలో మళ్లీ నురగ... బుధవారం ఉదయం నదిలోని నీటిపై తెట్టులా తేలింది. గోదావరిఖని కోల్‌బెల్టు వంతెన వద్ద  కనిపించిన ఈ నురగను చూసి నదిలో కాలుష్యం పెరిగిపోయిందని ప్రజలు ఆందోళన చెందారు. మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటిని ఇక్కడ నుంచి సరఫరా చేస్తున్నందున ఈ నదినీటి వల్ల ఇబ్బంది ఏమైనా రావచ్చేమోనని అనుమానిస్తున్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్‌ రవిదాస్‌ను వివరణ కోరగా ఇక్కడి గోదావరి నుంచి నురగ నమూనాలు తీసుకున్నామన్నారు. పరీక్షల అనంతరం వివరాలు తెలుస్తున్నాయన్నారు. గతంలోనూ ఇలాగే నురగ ఏర్పడగా పీసీబీ పరీక్షలు నిర్వహించి, సమస్య ఏమీ లేదని తేల్చటం గమనార్హం.

-న్యూస్‌టుడే, గోదావరిఖని

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని