బండెనక బండి.. భాగ్యనగరికండి!

ప్రధానాంశాలు

బండెనక బండి.. భాగ్యనగరికండి!

దసరా పండగకు సొంతూరు వెళ్లిన ప్రయాణికులు భాగ్యనగరానికి తిరుగు ప్రయాణం కావడంతో ఆదివారం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులుతీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా నుంచి చౌటుప్పల్‌ వరకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఈ మార్గంలో రద్దీ పెరిగింది. సాయంత్రం, రాత్రి వరకు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించడానికి గంటకుపైగా సమయం పట్టింది. మామూలు రోజుల్లో పంతంగి టోల్‌ప్లాజా నుంచి పది నిమిషాలలోపే వాహనదారులు చౌటుప్పల్‌ను దాటేస్తారు. పట్టణంలోని తంగడపల్లి రోడ్డు నుంచి వలిగొండ రోడ్డు వరకు, వలిగొండ రోడ్డు నుంచి లింగోజిగూడెం శివారు వరకు, అంకిరెడ్డిగూడెం స్టేజీ నుంచి జిల్లెడుచెల్క వరకు వాహనాలు నిలిచిపోయాయి. మొత్తం 16 టోల్‌బూత్‌లు ఉండగా.. జీఎమ్మార్‌ సంస్థ హైదరాబాద్‌ మార్గంలోనే తొమ్మిదింటిని తెరిచి వాహనాలను పంపించింది. ఫాస్టాగ్‌ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చినా ఈ స్థాయిలో రద్దీ ఉండటం ఇదే మొదటిసారని టోల్‌ప్లాజా వర్గాలు చెప్పాయి.

-న్యూస్‌టుడే, చౌటుప్పల్‌, చౌటుప్పల్‌ గ్రామీణం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని