శిరోజాలకు వెనిగర్‌
close
Published : 04/09/2021 02:24 IST

శిరోజాలకు వెనిగర్‌

వింధ్యకు పొడవైన జుట్టు ఉండేది. పెళ్లయ్యాక ప్రాంతం, నీళ్లు మారడంతో శిరోజాలు రాలిపోవడం మొదలైంది. దాంతో ఒత్తిడికి లోనవుతోంది. ఈ తరహా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలంటున్నారు నిపుణులు. అందుకు సూచనలిస్తున్నారు.

సీజన్‌లో... ఈకాలంలో చాలామందికి మాడు పొడిబారుతుంది. దీనివల్ల శిరోజాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆ సమయంలో వారానికొకసారి మాడుకు గోరువెచ్చని కొబ్బరినూనెను మర్దనా చేయాలి. అరగంటాగి రసాయన రహిత షాంపూతో శుభ్రపరుచుకోవాలి. డ్రైయర్‌తో కాకుండా వస్త్రంతో జుట్టును పొడిగా అయ్యే వరకు తుడిచి ఆరనివ్వాలి. వేసవిలో చెమటవల్ల మాడుపై మురికి చేరుతుంది. దీంతో రక్తప్రసరణ సరిగ్గా జరగక, శిరోజాలు రాలిపోవడానికి కారణమవుతుంది. వారంలో రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

ఈత కొట్టేటప్పుడు: తలకు క్యాప్‌ ధరించాలి. తల తడిస్తే వెంటనే మంచి నీటితో జుట్టును శుభ్రపరుచుకోవాలి. ఈ నీటిలో రెండు మూడు చెంచాల వెనిగర్‌ను కలిపితే మంచిది. కొలను నీటిలో కలిపే క్లోరిన్‌ గాఢత జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. గుడ్డులోని తెలుపు సొనను మాడుకు పట్టించి ఆరిన తర్వాత మంచి నీటితో స్నానం చేస్తే సహజ సిద్ధ కండిషనర్‌లా పనిచేస్తుంది.

చాక్లెట్‌తో: యాంటీ ఆక్సిడెంట్లు ఉండే డార్క్‌ చాక్లెట్‌, ఆకు కూరలు, క్యారెట్‌, క్యాబేజీ, బీట్‌రూట్‌, ముల్లంగి, చిలగడదుంప, గుమ్మడి వంటివి ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. ఒమేగా- 3 ఫాటీయాసిడ్స్‌ ఉండే చేపలు, సీ ఫుడ్‌, నట్స్‌, విత్తనాలు వంటివి ఎంచుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. విటమిన్‌ సి ఉండే పండ్లు ఈ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తాయి.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని