అనుపమ అందం వెనుక..
close
Updated : 21/10/2021 06:06 IST

అనుపమ అందం వెనుక..

బ్యూటీపార్లర్‌కు వెళ్లడం, కఠినమైన రసాయనాలున్న ఉత్పత్తులను ఉపయోగించడం అనుపమ పరమేశ్వరన్‌కు నచ్చదట. తన చర్మ సంరక్షణ స్వయంగా చూసుకుంటా నంటోంది. ఇంకా.. ‘కాఫీ, తేనె మాస్క్‌ను ఎక్కువగా ఉపయోగిస్తా. ఇది చర్మాన్ని మెరిపిస్తుంది. రెండు స్పూన్ల చొప్పున కాఫీ పొడి, తేనె కలిపి ముఖానికి పట్టించి, 15 నిమిషాలు ఆగి కడిగేస్తే చాలు. రోజులో కాసేపు వ్యాయామానికి కేటాయిస్తా. ఇదీ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. మంచినీటినీ ఎక్కువగా తీసుకుంటా. మరీ అవసరమైతే తప్ప మేకప్‌ని అదీ తక్కువ మొత్తంలోనే ఉపయోగిస్తా’ అని చెబుతోంది. తేలికైన సలహా అనిపిస్తోంది కదూ! ప్రయత్నిస్తారా?


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి