పాదాలకు వ్యాయామం!
close
Published : 08/06/2021 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాదాలకు వ్యాయామం!

సన్నబడాలనో, పొట్ట తగాలనో... రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. మరి పాదాల ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోం. వీటికి సంబంధించిన కొన్ని చిన్నపాటి వ్యాయామాలను చూద్దామా...

కొవిడ్‌తో మారిన జీవనశైలి... మహిళలకు పనిభారాన్ని పెంచేసింది. వంట, అంట్లు తోమడం, వాషింగ్‌ మెషిన్‌లో దుస్తులు వేయడం, ఇల్లు శుభ్రం చేయడం... ఇలా  దాదాపు అన్ని పనులూ ఎక్కువ సేపు నిలబడే చేయాల్సి రావడం వల్ల  కాళ్లపై భారం పడుతోంది. ఇలాంటప్పుడు కొన్ని వ్యాయామాలు చేస్తూ కాళ్లు, వేళ్లు, పాదాలకు సాంత్వన కలిగించవచ్చు.

కాలివేళ్లు...

* కుర్చీపై కూర్చొని కాలి కింద తువాలును పరవాలి. ఇప్పుడు దాన్ని కాలి వేళ్లతో లాగాలి. రెండు కాళ్లతో అయిదారుసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల కాలి కండరాలు బలంగా మారతాయి. కాలివేళ్లు సౌకర్యంగా ఉంటాయి.
* కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలను నేలపై సమాంతరంగా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా పాదాన్ని నేలకు ఆనించి వేళ్లను మెల్లిగా పైకి లేపాలి. ఇలా అయిదారు సార్లు చేయాలి.

బంతాట!

కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. టెన్నిస్‌ బంతిని పాదం కింద పెట్టి ముందుకు వెనక్కి  రెండు నిమిషాల పాటు జరపాలి. రెండోకాలితోనూ చేయాలి. దీనివల్ల కాలివేళ్లతో పాటు పాదానికీ సాంత్వన లభిస్తుంది. కావాలంటే బంతిపై పాదంతో మరికాస్త ఒత్తిడిని పెంచొచ్చు.

కండరాలకు సాంత్వన..

కుర్చీలో కూర్చొని ఒక కాలిని మరోకాలి మోకాలిపై పెట్టాలి. కాలివేళ్లను చేత్తో పట్టుకుని పెద్దవేలి వైపునకు వంచాలి. ఇలా చేయడం వల్ల పాదం, కాలి మడమల దగ్గర ఫ్లెక్సిబుల్‌గా మారి హాయిగా ఉంటుంది. మరోకాలితోనూ చేయడం మరవొద్దు.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని