గ్లిజరిన్‌తో మెరిసిపోదాం! - how glycerine is good for your skin
close
Published : 28/07/2021 20:06 IST

గ్లిజరిన్‌తో మెరిసిపోదాం!

అమ్మాయిలంతా చందమామని తలపించేంత అందం తమ సొంతం కావాలని ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే రకరకాల ఉత్పత్తులు, సౌందర్య చిట్కాలను సైతం ఆశ్రయిస్తూ ఉంటారు. అలాంటి వాటిలో గ్లిజరిన్ ఒకటి. దీనిని సౌందర్య సంరక్షణలో రకరకాలుగా ఉపయోగించే వీలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు సౌందర్య నిపుణులు. ఇంతకీ గ్లిజరిన్‌ని ఏ విధంగా ఉపయోగిస్తే అధిక ప్రయోజనాలు పొందచ్చు? దానిని వినియోగించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మొదలైనవి మనమూ ఓసారి తెలుసుకుందామా..

గ్లిజరిన్‌.. చక్కెర, ఆల్కహాల్‌ సమ్మేళనంతో తయారయ్యే ద్రవపదార్థం ఇది. చర్మానికి మంచి క్లెన్సర్‌గా, టోనర్‌గా ఉపకరించే దీంతో మొటిమల్ని, వాటి తాలూకు మచ్చల్ని సైతం దూరం చేసుకోవచ్చు.

ముఖం ప్రకాశవంతంగా మారడానికి..

నిమ్మరసం, రోజ్‌వాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖంపై మృదువుగా రుద్దుకొని కాసేపు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాదు.. హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యతో బాధపడే వారు ఎదుర్కొనే చర్మ సంబంధిత సమస్యలకు ఇది చక్కని పరిష్కారం చూపుతుంది.

ముడతలు పడకుండా..

బాదం నూనెలో కొద్దిగా గ్లిజరిన్ వేసి ఆ మిశ్రమంతో చర్మంపై మృదువుగా కాసేపు మర్దన చేయడం ద్వారా చర్మంపై ముడతలు రాకుండా జాగ్రత్తపడడంతో పాటు మోము మృదువుగా మారుతుంది.

నల్ల మచ్చల నివారణకు..

ముక్కు, నుదురు మీద వచ్చే నల్లమచ్చలు విపరీతమైన ఇబ్బంది కలిగిస్తుంటాయి. వాటికి చెక్ పెట్టేందుకు గ్లిజరిన్ చక్కగా ఉపకరిస్తుంది. దీని కోసం కొద్దిగా ముల్తానీ మట్టి తీసుకొని అందులో చెంచా ఉసిరి పొడి, తగినంత గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న ప్రాంతంలో ప్యాక్‌లా అప్త్లె చేసుకొని కాసేపు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది కేవలం నల్లమచ్చలు మాత్రమే కాదు.. తెల్ల మచ్చలను సైతం సులభంగా నివారిస్తుంది.

ఇలా కూడా..

* గ్లిజరిన్‌కి ఉండే యాంటీ ఫంగల్ గుణాల కారణంగా చుండ్రు సమస్యను నివారించడంలో కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

* మూడు చెంచాల పచ్చిపాలలో చెంచా గ్లిజరిన్ వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఫేషియల్ క్లెన్సర్‌గా ఉపయోగించవచ్చు.

* రోజ్‌వాటర్‌తో గ్లిజరిన్‌ని మిక్స్ చేసి ఉపయోగిస్తే చర్మానికి తగినంత తేమ అందుతుంది.

* చర్మం పొడిబారి, నిర్జీవంగా మారినప్పుడు మిల్క్ క్రీమ్‌లో కాస్త గ్లిజరిన్ వేసి ఆ మిశ్రమాన్ని ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

* పగిలిన లేదా పొడిబారి నిర్జీవంగా మారిన అధరాలను కూడా గ్లిజరిన్ తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది.

ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు..

గ్లిజరిన్ ద్వారా సౌందర్యపరంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీని వినియోగం విషయంలో మాత్రం తగినన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

* గ్లిజరిన్‌ని నేరుగా చర్మంపై ఉపయోగించకూడదు. ఇతర పదార్థాలతో కలిపి మాత్రమే దానిని ఉపయోగించాలి.

* చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే గ్లిజరిన్‌ని ఉపయోగించాలి. పరిమాణం ఎక్కువైతే చర్మానికి హాని కలగచ్చు.

* ఒకసారి గ్లిజరిన్ చర్మానికి అప్త్లె చేసిన తర్వాత దానిని ఎక్కువ సమయం చర్మంపై ఉంచకూడదు. నిర్ణీత సమయం తర్వాత వెంటనే శుభ్రం చేసేసుకోవాలి.

* గ్లిజరిన్ కాస్త జిగురుగా ఉంటుంది కాబట్టి దీనిని ముఖానికి అప్త్లె చేసుకున్న తర్వాత ముఖం శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం. లేదంటే వాతావరణంలోని దుమ్ము, ధూళిని ఇది ఆకర్షించి కొత్త సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని