Viral Video: తనకు ఇష్టమైన పాట పెడితేనే మండపంలోకి వస్తానన్న వధువు
close

Published : 25/08/2021 17:23 IST
Viral Video: తనకు ఇష్టమైన పాట పెడితేనే మండపంలోకి వస్తానన్న వధువు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లి మండపం వద్ద తనకు ఇష్టమైన పాట ప్లే అవుతుండగా.. గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలని కలలు కన్నది ఆ వధువు. తాను మండపంలోకి వస్తున్నప్పుడు ఆ పాటే పెట్టాలని డీజే ప్లే చేసేవారికి ప్రత్యేకంగా సూచించింది. తీరా తాను ఎంట్రీ ఇస్తున్న టైంలో ఆ పాట పెట్టకపోవడంతో ఆ వధువు తీవ్రంగా నొచ్చుకుంది. ఏడ్చినంత పనిచేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈనెల 15వ తేదీన శివాని పప్పెల్‌ అనే యువతి వివాహం వైభవంగా జరిగింది. ఇంటి నుంచి కల్యాణ వేదికకు చేరుకున్న తర్వాత మండపంలోకి వెళ్లే సమయంలో ‘పియా మోహె ఘర్‌ ఆయే’ అనే గీతాన్ని మాత్రమే పెట్టాలని అక్కడ డీజే ప్లే చేసేవాళ్లకు ముందుగానే చెప్పింది. తీరా ఆమె కల్యాణ వేదికకు చేరుకొని మండపానికి వెళ్లే సమయంలో ఆ పాట పెట్టలేదు. దీంతో శివాని తీవ్రంగా నొచ్చుకుంది. ఆ పాట పెట్టేవరకూ మండపానికి వెళ్లనంది. ‘నేను ఏ పాట ప్లే చెయ్యమన్నానో ఆ పాట పెట్టమనండి’ అంటూ ఆమె అలిగి, ఏడ్చేసినంత పని చేసింది. అసలేం జరిగిందో తెలియక అక్కడ ఉన్నవారంతా కొద్దిసేపు కంగారు పడ్డారు. ఆమె కోరుకున్న పాట పెట్టిన తర్వాతే వధువు మండపం వద్దకు కదిలింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఆ వీడియోను ఇప్పటివరకూ 2 మిలియన్ల మంది వీక్షించగా.. 1.2 లక్షల మంది లైక్‌ చేశారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని