Viral Video: మెట్రోస్టేషన్‌పైకెక్కి యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీస్‌
close

Published : 25/07/2021 17:21 IST
Viral Video: మెట్రోస్టేషన్‌పైకెక్కి యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీస్‌

ఫరీదాబాద్‌: ఏమైందో ఏమో తెలియదు గానీ.. ప్రియుడిపై కోపంతో హరియాణాకు చెందిన ఓ యువతి తనువు చాలించాలనుకుంది. మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల సమయానికి ఫరీదాబాద్‌లోని సెక్టార్ 28 మెట్రోస్టేషన్ బాల్కనీపైకి చేరుకుంది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై, కానిస్టేబుల్‌ సర్ఫరాజ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టేషన్‌ కింద నిల్చొని ఎస్సైతోపాటు కొందరు ఆమెను మాటల్లోకి దింపగా.. అదే సమయంలో కానిస్టేబుల్‌ బాల్కనీ పైనున్న యువతి వద్దకు చేరుకొని ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. విడిపించుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. వెంటనే మరో వ్యక్తి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. వారిద్దరూ కలిసి యువతిని బాల్కనీ నుంచి స్టేషన్‌ లోపలికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఫరీదాబాద్‌ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో  పోస్టు చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. యువతిని చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్‌ సర్ఫరాజ్‌ను పోలీసు కమిషనర్‌ ఓపీ సింగ్‌ కొనియాడారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని