Viral Video: ఇంటిపనుల్లో సాయం చేస్తున్న శునకం
close

Published : 23/06/2021 11:11 IST
Viral Video: ఇంటిపనుల్లో సాయం చేస్తున్న శునకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని రోజుల క్రితం మేరీ అనే యువతి తన పెంపుడు కుక్క ‘సీక్రెట్‌’తో కలిసి యోగా చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది. తాజాగా ‘సీక్రెట్‌’కు సంబంధించిన మరో వీడియో నెటిజన్లను మెప్పిస్తోంది. ఈ వీడియోలో శునకం తన యజమానికి ఇంటి పనుల్లో సాయం చేస్తూ కనిపించింది . సీక్రెట్‌.. బట్టలు ఉతకడం, ఉతికిన బట్టలు సర్దడంలో తనకు సాయపడుతోన్న వీడియోను మేరీ ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకోగా, అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా ‘సీక్రెట్‌’ ఆస్ట్రేలియన్‌ షెఫెర్డ్‌ జాతికి చెందిన శునకం. మేరీ ఏ పని చెప్పినా బుద్ధిగా నేర్చుకుని చేసేస్తుంది. పెంపుడుకుక్కతో కలిసి చేసిన పనులను మేరీ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకుంటోంది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని