నీళ్లు తెచ్చుకున్న వాళ్లకు ఆపరేషన్‌ చేస్తున్నామయ్యా!
latestnews
మా తాతకు మనవడినే..వారసుణ్ని కాదు!
15 ఏళ్లు... 25 సినిమాలు! ఎన్టీఆర్‌ అంటే ఇంతే కాదు... ఈ మధ్యలో ఓ మినీ జీవితాన్నే చూసేశాడు. నూనూగు మీసాల యవ్వనంలోనే స్టార్‌డమ్‌ బరువు మోశాడు.హిట్టంటే ఏమిటో తెలుసుకొనే లోపే... బ్లాక్‌బస్టర్‌ విజయాలు... దాన్ని అనుభవించేలోపే పరాజయాలు... అమితమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌... వీటన్నింటికి మించి ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న అంచనాలు - వీటి భారాన్ని ఇన్నేళ్లూ మోస్తూనే ఉన్నాడు ఎన్టీఆర్‌.ఈ మధ్యలో ‘ఆది’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘అదుర్స్‌’, ‘బృందావనం’, ‘టెంపర్‌’... ఇలా ప్రతి సినిమాతోనూ అభిమానుల్ని మెప్పిస్తూ, నటుడిగా సినిమా సినిమాకీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ప్రస్తుతం 25వ సినిమా దగ్గర ఆగాడు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ అనుబంధాల విలువను చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కెరీర్‌, చిత్ర ప్రయాణం గురించి ఎన్టీఆర్‌ ఇలా మనసు విప్పాడు!
ఈ జన్మకు అది చాలు
‘‘కథానాయకుడిగా 15 ఏళ్ల ప్రయాణం.. 25 సినిమాలు. ఈ లెక్కలు గుర్తుకొస్తే ఇంత దూరం ప్రయాణించానా? అనిపిస్తుంది. పరిశ్రమకొచ్చి ఎన్నేళ్లయింది? ఎన్నో సినిమా చేస్తున్నాననే విషయం నాకెప్పుడూ గుర్తుండదు. ఎవరో ‘ఇది నీ 25వ చిత్రం కదా’ అన్నారు. నా 25వ చిత్రంతో తల్లిదండ్రులకి అంకితం చేసే ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంది. సినిమా చేసేటప్పుడు లెక్కలేేసుకోను. మనసుకు నచ్చిన కథలతోనే ప్రయాణం చేస్తుంటా. హిట్టు సినిమా దర్శకులతోనే ఎన్టీఆర్‌ సినిమా చేస్తాడని మధ్యలో కొద్దిమంది ప్రచారం చేశారు.‘స్టూడెంట్‌ నెం.1’కి ముందు రాజమౌళి సినిమాలే చేయలేదు. ‘బృందావనం’కి ముందు వంశీ పైడిపల్లికి హిట్టుందా? వినాయక్‌, వర ముళ్లపూడి హిట్లిచ్చారనే సినిమాలు చేశానా? వాళ్లు చెప్పిన కథలు నా మనసుకు నచ్చడంతోనే వాళ్లతో ప్రయాణించా. మనకు నచ్చింది కాబట్టి... బయటి వాళ్లకూ నచ్చాలని లేదు. నాకు నచ్చినవన్నీ ప్రేక్షకులకు నచ్చితే ఇక అన్నీ సూపర్‌హిట్లే. మనుషులు, మనుషుల్లా ఉండాలి కాబట్టి దేవుడు అప్పుడప్పుడు మొట్టికాయ వేస్తుంటాడు. ఆ తప్పులు నుంచి మనం మరిన్ని నేర్చుకొంటాం. ప్రేక్షకులని ఒప్పించగలం అనే నమ్మకాన్ని ఏ దర్శకుడైనా కలిగిస్తే భవిష్యత్తులో ‘సాగరసంగమం’, ‘శంకరాభరణం’ లాంటి సినిమాలు చేయడానికైనా రెడీనే. పౌరాణికాల్లో నటించాలనే కోరిక కూడా ఎప్పట్నుంచో ఉంది. కానీ పౌరాణికాలన్నప్పుడు నాలో ఒక భయం కూడా కలుగుతుంటుంది. తాతగారితో పోల్చి చూస్తారు. నందమూరి తారక రామా రావులాగా మరొక వ్యక్తి ఉండరు, జన్మించరు కూడా. నేను ఆయన వారసుడిని కాదు... ఆయన మనవడిని మాత్రమే అని చెప్పుకుంటా. ఈ జన్మకిది చాలు’’.
పేరు అలా పుట్టింది 
‘‘నా ప్రయాణంలో అతి ముఖ్యమైన సినిమా ఇది. నా కెరీర్‌లో 25వ చిత్రం. దాంతో పాటు మా అబ్బాయి చూడబోయే మొదటి సినిమా ఇదే. తండ్రి కోరికని తీర్చిన ఓ కొడుకు కథతో చాలా సినిమాలొచ్చాయి. వాటన్నిటికీ భిన్నమైనదిది. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమాని అమ్మనాన్నకు, మా అబ్బాయి అభయ్‌కీ, తండ్రి తరవాత తండ్రంతటివాడు అన్నయ్యకీ చూపించాలనుకొన్నా. నిజంగా ఇలాంటి కథలు అరుదుగా దొరుకుతుంటాయి. ‘నాన్నకు ప్రేమతో’ అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే. ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి ‘నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌’ అన్నా. ‘చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం’ అన్నారాయన. మధ్యలో కొద్దిమంది మాస్‌, క్లాస్‌ అని ప్రస్తావన తీసుకొచ్చారు. కుల విభజనలాగా అలా మాస్లూ, క్లాసూ అని విడదీసి చూడటం నాకు మొదట్నుంచీ నచ్చదు. దండయాత్ర అనీ, అదనీ ఇదనీ ప్రచారం జరిగింది కానీ మేం మాత్రం మొదట్నుంచీ ఈ పేరునే అనుకున్నాం. ఇందులో ‘అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా’ అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది’’.
ఇక్కడ ఉండాల్సినోడు కాదు
‘‘సుకుమార్‌ సినిమాలంటే నాకు బాగా ఇష్టం. ‘జగడం’ విపరీతంగా నచ్చింది. ‘1 (నేనొక్కడినే)’ బాగా తీశారు. ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. ‘టెంపర్‌’ తరవాత సుకుమార్‌ చెప్పిన కథ బాగుందనుకున్నా. ఆ తర్వాత ఆయన నాన్నగారు చనిపోయారు. కొన్ని రోజులకు సుకుమార్‌ వచ్చి ‘ఓ కథ రాశా వింటారా’ అని ‘నాన్నకు ప్రేమతో’ కథ వినిపించారు. ‘అదిరిపోయింది’ అనేశా. తండ్రి చనిపోయిన క్షణాల్లో ఆయన కోసం ఏమైనా చేయాలి.. అనుకొని ఈ కథ రాయడం.. అద్భుతమనిపించింది. సుకుమార్‌ నిజంగానే ఇక్కడుండాల్సినవాడు కాదు. ఆయన ఆలోచనలు గమ్మత్తుగా ఉంటాయి. సుక్కుకి క్లారిటీ ఉండదని, ఒక్కో సన్నివేశానికీ మూడేసి వెర్షన్లు రాసుకొంటారని ఎవరో చెప్తుంటే విన్నాను. కానీ అదేం కాదు పెన్ను పట్టుకోవడం దగ్గర్నుంచి కన్ను కొట్టుకోవడం వరకూ.. ఏది ఎప్పుడు చేయాలో.. క్లారిటీ ఉన్న దర్శకుడాయన. తప్పకుండా తరతరాలు చెప్పుకొనే స్థాయిలో ఆయన నుంచి మరిన్ని సినిమాలొస్తాయి’’.
గెడ్డానికే... ఐదు నెలలు
‘నాన్నకు ప్రేమతో’ అనగానే అందరూ నా గెడ్డం గురించే మాట్లాడుతున్నారు. అదో బ్రాండ్‌ అయిపోయిందిప్పుడు. చూడ్డానికి బాగుంది కానీ, దాన్ని పెంచుకోవడానికీ, షూటింగ్‌ జరిగినన్నాళ్లు ఉంచుకోవడానీ చాలా కష్టపడ్డా (నవ్వుతూ). నిజం చెప్పాలంటే ఈ సినిమాలో గెడ్డంతో కనిపించాలని నేను ప్లాన్‌ చేసుకోలేదు. ‘టెంపర్‌’ తరవాత సరదాగా గెడ్డం పెంచా. సుకుమార్‌ ‘నాన్నకు ప్రేమతో’ కథ చెప్పినప్పుడు కూడా లుక్‌ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు. ‘యూకేలో షూటింగ్‌..’ అనగానే, అక్కడికి తగ్గట్టుగా ఏమైనా చేద్దాం అనిపించింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్‌లో ఎలాంటి ట్రెండ్‌ నడుస్తుందో గమనించి, రకరకాల స్టైల్స్‌ గురించి చర్చించుకొని, చివరికి దీనికి ఫిక్సయ్యాం. ఫిబ్రవరి నుంచి దాదాపు ఐదు నెలలు ఈ గడ్డం గురించే కసరత్తంతా. తొలిసారి ఈ గెటప్‌తో అద్దంలో చూసుకొంటున్నప్పుడు భయం వేసింది. అభిమానులు ఏం అనుకొంటారు? వాళ్లు చూస్తారా, లేదా? అనిపించింది. మా అమ్మకైతే ఏం అర్థం కాలేదు. మా ఆవిడ మాత్రం ‘ఓకే’ అంది. ఎప్పుడైతే ఫస్ట్‌లుక్‌ విడుదల చేశామో.. అప్పుడు నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అభిమానులకు లుక్‌ విపరీతంగా నచ్చింది. ‘గెడ్డం తీసేటప్పుడు వీడియో తీద్దాం.. లేదంటే అభయ్‌ నన్ను గుర్తుపట్టడు’ అనుకొన్నాం. అయితే ఆ సమస్య లేకుండా పోయింది.. గెడ్డం తీసినా నా గొంతు విని అభయ్‌ నన్ను గుర్తుపట్టేశాడు. గెడ్డం ఎప్పుడైతే తీసేసి మామూలు లుక్‌కి వచ్చేశానో.. ఇప్పుడు హాయిగా అనిపిస్తోంది’’
తనకొచ్చిన మొదటి మాట... నాన్న
‘‘నేనే చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తుంటా. నేనే అనుకుంటే మా అబ్బాయి అభయ్‌ అల్లరి ఇంకా ఎక్కువ (నవ్వుతూ). నేను కనిపించానంటే నాన్నా అంటూ వెంటపడుతుంటాడు. తనకి మొదట వచ్చిన మాటే నాన్న. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో మా అబ్బాయిని అలాగే పెంచుతున్నా. వాడు స్టార్‌ కొడుకు అన్న మాటకు దూరంగా పెరగాలన్నది నా కోరిక. అందుకే వాణ్ని ఇంట్లోనే ఉంచేయకుండా ప్రణతి రోజూ ఇంటి పక్కనున్న పార్క్‌కి తీసుకెళుతుంటుంది. అందరి పిల్లలతో ఆడుకోనిస్తుంది. చదువుకొనే వయసులోనూ, అల్లరి చేసే వయసులో నేను సినిమాలతో బిజీ అయిపోయా. నేను అప్పట్లో ఏమేం కోల్పోయానో అవన్నీ మా అబ్బాయి ఆస్వాదించాలన్నదే నా కోరిక’’.
దేవీకి హ్యాట్సాఫ్‌
‘‘నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం. ‘అదుర్స్‌’ కోసం పాట పాడుతున్నప్పుడు తొలిసారి సత్యమూర్తి గారిని కలుసుకొన్నా! గొప్ప వ్యక్తి. దురదృష్టవశాత్తూ.. ఈ మధ్యే చనిపోయారు. నిర్మాణానంతర కార్యక్రమాలు అప్పుడే వూపందుకొన్నాయి. ఆ సమయంలో ఏం చేయాలో మాకెవ్వరికీ అర్థం కాలేదు. మనసంతా స్తబ్దుగా అయిపోయింది. రెండు రోజుల తర్వాత దేవినే మెసేజ్‌ చేశాడు. ‘ఈ రోజే రఘు దీక్షిత్‌తో ఓ పాట పాడించా.. వర్క్‌ మొదలెడుతున్నా..’ అని సెల్‌ఫోన్‌ సందేశం పంపాడు. పని పట్ల తనకున్న అంకితభావానికి హ్యాట్సాఫ్‌...’’
బాబాయ్‌తో గొడవలా?
‘‘నాకెవరితోనూ గొడవల్లేవండీ. నందమూరి కథా నాయకుల మధ్య ‘వార్‌’ సాగుతోందన్న మాటల్లోనూ నిజం లేదు. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలొస్తే.. అన్నీ ఆడాలి. మరో విషయం ఏంటంటే.. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత నాకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. బాబాయ్‌కీ నాకూ పడడం లేదని రకరకాల వార్తలొస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన పని లేదు. ఏమీ లేకపోయినా ‘ఏదో ఉంది..’ అని పుకార్లు పుట్టిస్తున్నారు. ఎక్కడో జరిగిన రెండు సంఘటనల్ని కలుపుకొని ఏదో ఉందట.. అని రాస్తున్నారు. ‘అట’ అని రాస్తే ఫర్వాలేదు... ‘ఉంది’ అని ఎవరికి వాళ్లే నిర్ధారించుకొంటే నేనేం చెప్పేది? ఎవరితోనైనా నాకు విభేదాలుంటే నేనే చెప్తా. సత్సంబంధాలుంటే చెప్పాల్సిన అవసరం లేదు. నా మీద వేసే ప్రతిరాయిని మళ్లీ విసరడం ఎందుకు? నాకు అంతకు మించిన పనులున్నాయి కదా? అయినా బాబాయ్‌తో నాకు పడడం లేదని నేను చెప్పానా, లేదా బాబాయ్‌ ఏమైనా చెప్పారా?’’
రాజమౌళి చేతుల్లోనే...
‘‘నా మైండ్‌ సెట్‌ని మార్చిన దర్శకుడు రాజమౌళి. అంతేకాదు ‘యమదొంగ’తో నా లుక్‌నీ మార్చేశాడు..! సన్నబడాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. కానీ ఎందుకో సంశయించేవాణ్ని. ‘నువ్వు దూకాల్సిందే’ అని వెనుక ఎవరో నిలబడితే గానీ.. మనం దూకం. నా వెనుక అలా నిలబడిన వ్యక్తి.. రాజమౌళి. తనతో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు? అని అందరూ అడుగుతుంటారు. అది నా చేతుల్లో లేదు. ఆయనే నిర్ణయించాలి. అయినా ఎంతసేపూ మనతోనే చేస్తే, ఆయన బయటకు ఎప్పుడు వెళ్తాడు? తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్‌కి తీసుకెళ్లే సత్తా ఆయనది. అలాంటి దర్శకుణ్ని ఇక్కడికే పరిమితం చేయకూడదు’’.
నాన్న నేర్పిన పాఠం
‘‘మా స్ఫూర్తి మా నాన్నగారే. ఆయన మమ్మల్ని పెంచిన విధానంలోనే మా పిల్లల్ని పెంచాలి. ఆయన మాకు చెప్పిన మాటలను వాళ్లకు చెప్పాలనిపిస్తుంటుంది. ‘మీ కెరీర్‌ మీదే.. మీరే మార్గంలో వెళ్తారో అది మీ ఇష్టం’ అని నాన్న చెప్పేవారు. నేనూ అన్నయ్య సినిమాల్లోకి వచ్చాం. మా తొలి సినిమా అయిపోయాక ఇద్దరినీ పిలిచారు. ‘ఓ సినిమా వరకే నేను మీతో ఉన్నాను. ఇక నుంచి మీ తప్పుల్ని మీరే సరిదిద్దుకోండి. మీ గెలుపు కోసం మీరే కష్టపడండి. మీ ఫలాలు మీరే అనుభవించండి. వెనుక మా నాన్న ఉన్నాడనే ధైర్యం వద్దు’ అన్నారు. మేమూ అలానే నడుచుకొన్నాం. ఏం చేయాలో, ఏం చేయకూడదో నేర్చుకొన్నాం. ఈ అనుభవాలే మా పిల్లలతో పంచుకొంటాం. అవి వాళ్లకూ పాఠాల్లా ఉపయోగపడతాయి’’.
మరో అమ్మ... ప్రణతి
‘‘ప్రణతి వచ్చాక నా జీవితం చాలా మారిపోయింది. తను నాలో ఫోకస్‌ పెంచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రణతి మరో అమ్మ నాకు. నాలో ఒక పిల్లాడు ఉంటాడు. వాడిని ఎప్పుడూ అలాగే ఉంచుతూ ఉంటుంది. తను నాకిచ్చిన గొప్ప కానుక ఏంటంటే... అభయ్‌. అందుకోసం తిరిగి తనకి ఏం ఇవ్వాలో తెలియదు. నేను వంట బాగా చేస్తా కానీ... ప్రణతికి వంట రాదు. జీవితంలో తను ఒకేసారి కేక్‌ చేయడానికి ప్రయత్నించింది. అది మాడిపోయింది. ఆ దెబ్బకి ‘మేడమ్‌ని వంట చేయడం ఆపేయమనండి సార్‌’ అంటూ మా కుక్‌ పారిపోయాడు. తను మళ్లీ తిరిగి రాలేదు (నవ్వుతూ). అప్పట్నుంచి అతి కష్టంగా ఆమ్లెట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది’’.

బుకాయింపుల బూటకం!

పట్టుమని అయిదు లక్షల రూపాయల పెట్టుబడి; అలవోకగా దాదాపు అయిదు వేలకోట్ల రూపాయల గిట్టుబడి! సోనియాగాంధీ...

Full Story...

అన్నీ ...ప్రశ్నలే?

‘ఉదయ్‌కిరణ్‌ను సాయికుమార్‌ నా రివాల్వర్‌తో కాల్చాడు. నా చేతుల్లోంచి బలవంతంగా దాన్ని తీసుకున్నాడు... భయంతో నేను పారిపోయాను’ ...

ఆయకట్టు... అదిరేట్టు!

చెరువుల సుందరీకరణతోపాటు వాటి కింద ఉన్న పంటపొలాలకు సాగునీరు అందించడానికి జిల్లా అధికారులు పక్కాగా ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు ఎనిమిది చెరువులను ఎంపిక...

2జీ నుంచి 5జీ.. వైఫై.. వాట్సప్‌!

జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు అధునాతనమైన మొబైల్‌ సేవలు అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల టెలికాం ఆపరేటర్లు పోటీ పడుతున్నారు.

నిధులున్నా.. నిర్లక్ష్యమే!

వరుసగా నాలుగు పంటలకు సాగు నీరు లేదు.. కూలీలు పనులు వెతుక్కుంటూ వలస బాట పడుతున్నారు.. సన్న, చిన్నకారు రైతులు చేయడానికి పని లేక...

జిల్లా ప్రాజెక్టులకు రూ.8,690.30 కోట్లు

జిల్లాలో ప్రధాన ఎత్తిపోతల పథకాలకు జూరాల ప్రాజెక్టు కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయటం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వచ్చే మార్చి 2016-17 బడ్జెట్‌లో...

రూ.18.50 కోట్లకు తూట్లు

గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వాస్పత్రి పనుల్లో నాణ్యత కొరవడుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు ...

అందరి జీవితాల్లో వెలుగులు

‘‘పాలకులు మారుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి. మా జీవితాలు మాత్రం మారడం లేదు. మాకు భరోసా కల్పించే నాయకులే కరవయ్యారు. ఫ్లోరైడ్‌ మహమ్మారీ వల్ల మా...

బెల్లం.. బంగారమే..!

24క్యారెట్ల బంగారం కొనుగోలు చేయాలనుకున్నా వినియోగదారుల చిరునామా అవసరం లేదు. ముత్యాలు, వజ్రాల వ్యాపార ప్రాంతాల్లో కూడా అధికారులు సీసీ కెమేరాలను ఏర్పాటు చేయలేదు.

పది పరీక్షల్లో ‘కెమెరా’ల కల్లోలం...

ప్రతి ఒక్కరికీ పరీక్ష అనగానే ఏదో తెలియని ఉత్కంఠ సహజం. కొందరికి పరీక్షా కేంద్రం ఫోబియా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పెడితే మరింత ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెదడ, ...

ముందే సగం డబ్బులు

గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టిన ప్రభుత్వం తాజాగా నిర్మాణాల్లో కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టింది. మరుగుదొడ్ల నిర్మాణాన్ని మరింత...

బహిరంగ విఫణిలోకి మార్క్‌ఫెడ్‌

బహిరంగ మార్కెట్‌లో ఈనెల 5న క్వింటాలు కందుల ధర రూ.7000లు... 6న మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగాక క్వింటా ధర రూ.7677లు... 9న ఇదే ధర వద్ద కొనసాగిన కొనుగోళ్లు... దీంతో తప్పనిసరై ప్రైవేటు...

హామీకి ఏడాది...ఆచరణకు దారేది

ఎక్కడపడితే అక్కడ పెంటకుప్పలు లేకుండా.. గ్రామం మొత్తం పశువులు ఒకే స్థలంలో ఉంటూ.. పాలను మద్దతు ధరకు అమ్ముతూ.. పశువులకు అందుబాటులో వైద్యులు, గడ్డి నిల్వ గోదాము..

మరో సంగమం

నదుల అనుసంధానంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం.. పశ్చిమ కృష్ణాలోనూ మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. తిరువూరు...

చిత్రావతిలో ఇసుక దొంగలు!

చిత్రావతి నదిలో ఇసుకాసురులు తిష్టవేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెరసి సహజ వనులు ధ్వంసం అవుతున్నాయి. అక్రమ రవాణాను అరికట్టాల్సిన యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.

రబీ సాగుకు ఎత్తిపోతలు

జిల్లాలో రబీలో సాగునీటి ఎద్దడి నివారణకు నీటిపారుదల శాఖ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. రబీలో పంటకు నీటి సమస్య తలెత్తకుండా గోదావరిలో తాత్కాలిక...

కొత్త పారిశ్రామికవేత్తలకు ‘వసతుల’ హారతి

చుట్టుపక్కల జిల్లాలకు కొత్త పరిశ్రమలు వరుసగా వస్తుంటే.. కడప జిల్లా వైపు మాత్రం ఎవరూ తొంగి చూడడం లేదు. వేలాది ఎకరాల భూమి అందుబాటులో...

కళ్లను పొడిచే రెప్పలు.. గుడ్లను మింగే పాములు

గ్రామీణ నిరక్షరాస్యత.. కొందరి వైద్యుల అత్యాశ.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం... ఆడశిశువులకు మరణశాసనం రాస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలపై నిఘా ఉంచాల్సిన యంత్రాంగం...

జిల్లాలో ‘జిందాల్‌’ పవర్‌

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయనున్న కినెట థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌పై ప్రతిష్టంభన తొలగింది. థర్మల్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ థర్మల్‌ కేంద్రం వాటాలను...

పీజీ.. ఈజీ కాదు

రిమ్స్‌కు రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఇప్పుడిప్పుడే అరుదైన శస్త్రచికిత్సలతో పేదల మనసులకూ దగ్గరవుతోంది.. కానీ.. అందుకు తగ్గట్లు వైద్యుల సంఖ్య పెరగకపోవడం కొత్త సమస్యలకు దారి తీస్తోంది.

పలాసలో నాణ్యత పలాయనమే!

నీటి పథకం అంటే... ‘అవినీతి మయం’ అనే మాట ఇక్కడ రుజువవుతోంది. తాగునీటి సరఫరా నిధులంటే... జేబులో వేసేసుకొవచ్చనే ఆరోపణలు ఇక్కడ నిజమే అనేలా పనులు సాగుతున్నాయి.

వెళ్లొస్తాం..

భౌగోళికంగా విడివిడిగా ఉన్నా.. మహా సాగరాల్లో మనమంతా ఒక్కటే అన్న నినాదం మారుమోగించి.. విశాఖ సాగర తీరాన మనతో మమేకమై.. మన ఆతిథ్యానికి మెచ్చి.. జనంతో సందడి...

పచ్చ‘ధనానికి’ రెక్కలు...!

సాధారణంగా మన ఇంటివద్ద ఒక మొక్క వేస్తే ప్రతిరోజూ ఎలా ఉందో చూసుకుంటాం. ఎండిపోతే నీరు పోసి సంరక్షణ చర్యలు చేపడతాం. ఎదిగే వరకూ అన్ని చర్యలు...

చిన్న మోసం.. పెద్ద లాభం

తూనికలు-కొలతలు శాఖ మొద్దునిద్ర పోతోంది. ఎంతలా అంటే వారి అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ విభాగాలకు సంబంధించి 28 వేల దుకాణాలు నమోదై ఉంటే కేవలం వీటిలో...