ఆపాదమస్తకం సాంకేతికం

తాజావార్తలు


ఆపాదమస్తకం సాంకేతికం
అంతర్జాలం లేనిదే ఏ పనీ కావడం లేదు... గ్యాడ్జెట్‌ లేకపోతే పూట గడవడం లేదు...ప్రతి పనిలోనూ సాంకేతికత తన ప్రభావం చూపిస్తోంది... నిద్ర లేచింది మొదలు... మళ్లీ రాత్రి నిద్రపోయేవరకు...ఓ మనిషి ఆరోగ్య పర్యవేక్షణ విషయంలోనూ టెక్నాలజీ అదే చేస్తోంది!తల నుంచి పాదాల వరకు అన్నింటా సాంకేతికతే కనిపిస్తోంది!ట్రాకర్‌, మొబైల్‌ ఆప్‌ల మేళవింపుతో ఆరోగ్య మదింపు సులభమవుతోంది!అలా మనిషికి ఆపాదమస్తకం ఉపయోగపడుతున్న గ్యాడ్జెట్ల గురించి చూద్దామా!

లకు పెట్టుకునే హెయిర్‌ బాండ్‌ లాంటి గ్యాడ్జెట్‌తో ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయొచ్చు. వీటికి హెడ్‌ఫోన్‌ లాంటి అమరిక కూడా ఉంటుంది. దీంతో సంగీతం, పాటలు వింటూ ధ్యానం, కసరత్తులు చేయొచ్చు. Runphone అలాంటి హెయిర్‌ బాండే. ఆన్‌లైన్‌ అంగడి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ. 12,442. మెదడు పనితనాన్ని తెలుసుకునేలా Muse అనే బాండ్‌ను కూడా రూపొందించారు. కసరత్తులు చేసేటప్పుడు మనిషి మెదడు పనితనాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని ధర సుమారు రూ. 30 వేలు.

సరత్తులు చేసేటప్పుడు మోచేయి కదలికలు, తెలుసుకోవడానికీ కొన్ని గ్యాడ్జెట్లున్నాయి. బరువులు ఎత్తేటప్పుడు చేతి కదలికలను ఈ గ్యాడ్జెట్‌ ట్రాక్‌ చేసి మొబైల్‌ ఆప్‌కు పంపిస్తుంది. దాని ద్వారా మీ కసరత్తులపై మీకు అవగాహన వస్తుంది. అలాంటివాటిలో Pushband ఒకటి. తలకు పెట్టుకునే బ్యాండ్‌లా ఉండే దీన్ని కసరత్తులు చేసేటప్పుడు మోచేయికి పెట్టుకోవాలి. దీని ధర 289 డాలర్లు.

గుండెచప్పుడు బట్టి మనిషి ఆరోగ్యాన్ని లెక్కగట్టే గ్యాడ్జెట్లున్నాయి. కసరత్తు చేసేటప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని ఈ ట్రాకర్‌ నమోదు చేసి అనుబంధ ఆప్‌కు సమాచారం పంపిస్తుంది. Myzone MZ-3 అలాంటి గ్యాడ్జెటే. బెల్ట్‌లా ఉండే దీనికి మధ్యలో ట్రాకర్‌ ఉంటుంది. కసరత్తు చేసేటప్పుడు గుండెకు దగ్గరగా ఉండేలా ఈ బెల్ట్‌ను అమర్చుకోవాలి. దీని ధర సుమారు 150 డాలర్లు. wahoo Tickr X (100 డాలర్లు), suunto smart sensor (85 డాలర్లు)ఇలాంటివే.

హారపు అలవాట్లు, దాని వల్ల శరీరంలో వస్తున్న మార్పుల్ని తెలుసుకునేలా స్మార్ట్‌ బెల్ట్‌లు రూపొందాయి. నడుము పరిమాణం, ఆహారపు అలవాట్లు, నిద్ర విధానం, ఎంతసేపు, ఎలా కూర్చున్నారనే విషయాలు ఈ బెల్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. శామ్‌సంగ్‌ ఇలాంటి ఓ బెల్ట్‌ను రూపొందించింది. weltగా పిలుస్తున్న ఈ ట్రాకర్‌ను ఇటీవల జరిగిన ఐఎఫ్‌ఏ 2016లో ప్రదర్శించారు. Belty కూడా అలాంటిదే. ఎక్కువసేపు నడిచేలా శరీరాన్ని ఉత్తేజితం చేయడం ఈ బెల్ట్‌ ప్రత్యేకత. ఇది ఇంకా మార్కెట్‌లోకి రావల్సి ఉంది.

కాళ్ల నొప్పులు వస్తే పెయిన్‌ రిలీఫ్‌ బామ్‌లు రాసుకోకుండా.. ఓ బ్యాడ్జి లాంటిది పెట్టుకుంటే సరి. అదే నొప్పి పని పడుతుంది. బ్యాడ్జిలోని ఎలక్ట్రిక్‌ నెర్వ్‌ స్టిమ్యులేషన్‌ సాంకేతికతో ఈ పని సాధ్యమవుతుంది. Quell గ్యాడ్జెట్‌ ఈ సాంకేతికతతో రూపొందినదే. శరీరంలో ఏ భాగంలో నొప్పి వస్తే... అక్కడ ఉండే ఈ గ్యాడ్జెట్‌ను కట్టుకొని బటన్‌ ఆన్‌ చేస్తే సరి. దాని నుంచి వేడి జనించి శరీరానికి సాంత్వన ఇస్తుంది. దీని ధర 249 డాలర్లు.

బూట్ల అడుగు భాగంలోని సోల్‌లో సెన్సార్లు అమర్చి వాటిని ట్రాకర్లగా వినియోగిస్తున్నారు. ఆ సెన్సార్లను అంతర్జాలం సాయంతో మొబైల్‌లోని ఆప్‌కు అనుసంధానం చేసి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌గా వినియోగిస్తున్నారు. రన్నింగ్‌, జాగింగ్‌ చేసేవాళ్లకు ఇవి ఉపయుక్తం. Digitsole, Shiftwear, Lechal Haptic లాంటివి ఈ తరహా స్మార్ట్‌ బూట్లు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. సాధారణ బూట్లకు Dorothy, Carv లాంటి ట్రాకర్లు అమర్చుకొని స్మార్ట్‌ బూట్లుగా మార్చుకో వచ్చు.

బూట్లే కాదు... సాక్సులు కూడా సాంకేతికతను జోడించుకున్నారు. ఈ- టెక్స్‌టైల్‌తో రూపొందిన సాక్సుల్లో మైక్రో సెన్సార్లు అరుస్తున్నారు. ఇవి రన్నింగ్‌ చేసే వారికి ఉపయుక్తంగా ఉంటాయి. పరిగెడుతున్నప్పుడు ఈ సెన్సార్లు సమాచారాన్ని గ్రహించి అనుబంధ ఆప్‌కు పంపిస్తాయి. Sensoria ఫిట్‌నెస్‌ సాక్సులు ఈ తరహావే. స్మార్ట్‌ యాంక్లెట్‌తో కలిపి ఇవి 200 డాలర్లుకు ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి.

సాంకేతికత జోడీగా వస్తున్న కళ్లద్దాలతో యాక్టివిటీ ట్రాకింగ్‌ సులభమవుతుంది. చూపు స్పష్టత ఇచ్చే కళ్లద్దాలకు జీపీఎస్‌, డిజిటల్‌ కెమెరా, ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ లాంటి సాంకేతికత జోడించి స్మార్ట్‌ కళ్లజోడు తయారు చేశారు. వీటిని ఎక్కువగా సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేవాళ్లు వాడుతుంటారు. solos, vuzix M300, epson moverio, sony smart glass లాంటివి అంతర్జాతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రయోగ దశలో ఉన్నాయి.

కూర్చునే విధానం కూడా మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కూర్చునే పోస్చర్‌ (తీరు) గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఉత్తమం. దీని కోసమూ కొన్ని గ్యాడ్జెట్లున్నాయి. కూర్చునే విధానం బాగాలేకపోతే Lumo lift లాంటి గ్యాడ్జెట్‌లు మార్పులు సూచిస్తాయి. ఈ ట్రాకర్‌ను చొక్కాకు తగిలించుకోవాలి. ఆ తర్వాత మీరు కూర్చునే శైలి ఆరోగ్య సమస్యను తీసుకొచ్చేలా ఉంటే ఈ ట్రాకర్‌లో వైబ్రేషన్‌ వస్తుంది. అప్పుడు సరైన పోజుకు మారాలి. అమెజాన్‌లో ఈ గ్యాడ్జెట్‌ రూ. 7,499కి అందుబాటులో ఉంది.

వాచీలు పోయి, స్మార్ట్‌ వాచీలు వచ్చేశాయి. చాలా అవసరాలు తీరుస్తున్నాయి. సమయం చూసుకోవడం పక్కపెడితే మొబైల్‌కి వచ్చే మెసేజ్‌లు, మెయిళ్లు చూసుకోవడం, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ చేసుకోవడం లాంటివి స్మార్ట్‌వాచీలు చేస్తున్నాయి. చాలా కంపెనీలు స్మార్ట్‌వాచీ రంగంలోకి దిగాయి. ఫిట్‌బిట్‌, సోనీ, జియామీ, నైక్‌-ఫ్యూయల్‌, ఇంటెక్స్‌ లాంటి సంస్థలు స్మార్ట్‌ వాచీలను విడుదల చేశాయి. ఆపిల్‌ తన ఆండ్రాయిడ్‌ వేర్‌లో ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ను జోడించింది. ఇదే తరహాలో కొన్ని రిస్ట్‌ బ్యాండ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

గుండెచప్పుడు, గాలి పీల్చే విధానం లాంటి విషయాలు తెలుసుకునేలా స్మార్‌ చొక్కాలు రూపొందాయి. కసరత్తులు, జాగింగ్‌ చేసేవారికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. ఆ సమయాల్లో ఈ చొక్కాలు గుండె పని తీరుని పసిగట్టి ఆ వివరాలను అనుబంధ ఆప్‌కు పంపిస్తాయి. Hexoskin స్మార్ట్‌ చొక్కా అలాంటిదే. దీంతో గుండెచప్పుడు, శ్వాస పీల్చుకునే విధానం, యాక్టివిటీ, కేలరీల ఖర్చు, నడిచినప్పుడు అడుగుల గణన లాంటివి చేయొచ్చు. దీని ధర 200 డాలర్లు. eshirt పేరుతో ఇలాంటిదే మరొకటి సిద్ధమవుతోంది. ఇది ఇంకా మార్కెట్‌లోకి రావాల్సి ఉంది.

రీరంలోని కొవ్వు, కండరాల పరిమాణాన్ని లెక్కించడానికి కొన్ని గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయి. పొట్ట భాగం, చేతులు లాంటి ప్రాంతాల్లోని కొవ్వు పరిమాణాన్ని వీటితో కొలిచి తెలుసుకోవచ్చు. Fabrication ENT Accu- Measure Fat Tracker Digital caliper అలాంటి గ్యాడ్జెటే. దీని ద్వారా శరీరంలోని కొవ్వు శాతాన్ని తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌ అంగడిలో దీని ధర సుమారు రూ. 7659. ఈ గ్యాడ్జెట్‌తో కొలిస్తే... వివరాలు మొబైల్‌లోని అనుబంధ ఆప్‌లో ప్రత్యక్షమవుతాయి. ఇవేకాకుండా రూ. 1093 ధరతో Accumeasure Myotape లాంటి టెస్టర్‌ కిట్లూ ఉన్నాయి.

(వీటిలో కొన్ని గ్యాడ్జెట్లు అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. త్వరలో మన దేశ విపణిలో అందుబాటులోకి వస్తాయి)

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.