అసెంబ్లీ ఆవరణలో కబడ్డీ.. కబడ్డీ..

తాజావార్తలు

అసెంబ్లీ ఆవరణలో కబడ్డీ.. కబడ్డీ..
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అసెంబ్లీ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ స్పోర్ట్స్‌మీట్‌ను తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, సభాపతి మధుసూదనాచారి, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కరచాలనం చేసి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌, మధుసూదనాచారి ఉద్యోగులతో కలిసి కబడ్డీ ఆడుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు. మహిళా ఉద్యోగులకు కుర్చీ ఆటలు నిర్వహించారు. ఈ స్పోర్ట్‌ మీట్‌లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.