Rahul Gandhi: కష్టసుఖాల్లో తోడుగా నిలిచాం.. ప్రియాంకతో అనుబంధాన్ని పంచుకున్న రాహుల్

దిల్లీ: రక్షాబంధన్‌ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ వివిధ దశల్లో జరుపుకొన్న రక్షాబంధన్‌ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. వారి మధ్య ఉన్న అనుబంధం వాటిలో ప్రస్ఫుటమవుతోంది. ‘‘నేను, నా సోదరి ప్రియాంక బాల్యం నుంచి ఒకరికొకరం తోడుగా నిలిచాం. కష్టసుఖాల్లోనూ పరస్పరం అండగా ఉంటూ ధైర్యం చెప్పుకొన్నాం. సోదరి, ఈ బంధం శాశ్వతంగా ఉంటుంది’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.



మరిన్ని

ap-districts
ts-districts