1,082 మందికి శౌర్య పురస్కారాలు

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్రాల పోలీసు విభాగాలకు చెందిన 1,082 మందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింది. విధి నిర్వహణలో అసమాన ప్రతిభ కనబరిచినవారికి, సాహసోపేతంగా వ్యవహరించినవారికి ఇచ్చే సేవా పతకాలూ ఇందులో ఉన్నాయి. 347 మందికి పోలీసు శౌర్య పతకాలు, 87 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 648 మందికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వను న్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శౌర్య పతకాలు అందుకునే 347 మందిలో 204 మంది జమ్మూ-కశ్మీర్‌లో సేవలు అందించినవారే. మొత్తంమీద అత్యధికంగా 109 పతకాలు ‘కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం’ (సీఆర్పీఎఫ్‌) సిబ్బంది పొందారు. ఐటీబీపీకి చెందిన 20 మందికి వివిధ పతకాలు లభించాయి. రాష్ట్ర పోలీసులలో మహారాష్ట్రకు చెందినవారు 42 పురస్కారాలు పొందారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని