రవితేజ నిర్మాణంలో...

కథానాయకుల్లో చాలామందికి సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల నుంచి అప్పుడప్పుడు కొత్తతరాన్ని పరిచయం చేస్తూనే ఉన్నారు. కథానాయకుడు రవితేజ తన ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌ పతాకంపై ‘ఛాంగురే బంగారు రాజా’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. కార్తీక్‌రత్నం, కుషిత కల్లపు నాయకానాయికలు. సతీష్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సత్య అక్కల, రవిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్‌ కామెడీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు రవితేజ క్లాప్‌నివ్వగా, హీరో విష్ణు విశాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. రవిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. బి.వి.ఎస్‌.రవి, సుధీర్‌బాబు స్క్రిప్ట్‌ని అందజేశారు. ‘‘కథాబలం ఉన్న చిత్రమిది. సెప్టెంబర్‌ నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ‘కేరాఫ్‌ కంచరపాలెం’, ‘నారప్ప’ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన కార్తీక్‌రత్నం ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. కొత్త తరం కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే తెలియజేస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి. స్క్రీన్‌ప్లే: జనార్దన్‌ పసుమర్తి, కూర్పు: కృష్ణ కార్తీక్‌, కళ: శ్రీనివాస్‌ నార్ని, సంగీతం: కృష్ణ సౌరభ్‌, ఛాయాగ్రహణం: సుందర్‌.ఎన్‌.సి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని