మళ్లీ సునాక్‌ వెనుకంజ

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ వారసుల ఎంపిక కోసం జరుగుతున్న ఎన్నికలో భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ కంటే ఆయన ప్రత్యర్థి అయిన విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ స్పష్టంగా ముందంజలో ఉన్నట్లు తాజా సర్వే తేల్చింది. బుధవారం రాత్రి విడుదల చేసిన ఈ సర్వే ఫలితాల ప్రకారం.. లిజ్‌ ట్రస్‌కు కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో 58 శాతం మంది మద్దతు ఉన్నట్లు తేలగా, మాజీ మంత్రి రిషి సునాక్‌కు 26 శాతం మాత్రమే మద్దతు పలికారు. మిగతావారు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts