జనవరి ఎగుమతుల్లో వృద్ధి - Increase in january Exports
close

Published : 16/02/2021 10:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనవరి ఎగుమతుల్లో వృద్ధి

1454 కోట్ల డాలర్లకు తగ్గిన వాణిజ్యలోటు

దిల్లీ: వరుసగా రెండో నెలా ఎగుమతులు పుంజుకున్నాయి. 2020 జనవరితో పోలిస్తే, గత నెలలో ఎగుమతులు 6.16 శాతం పెరిగి 2745 కోట్ల డాలర్ల (దాదాపు     రూ.2.05 లక్షల కోట్లు)కు చేరాయి. ఔషధ, ఇంజినీరింగ్‌ వస్తువుల రంగాలు రాణించడం ఇందుకు దన్నుగా నిలిచింది. దిగుమతులు కూడా 2 శాతం పెరిగి 4200 కోట్ల డాలర్ల చేరాయి. అయినప్పటికీ వాణిజ్య లోటు 1454 కోట్ల డాలర్ల  (రూ.లక్ష కోట్లు)కు తగ్గింది. 2020 జనవరిలో వాణిజ్య లోటు 1530 కోట్ల డాలర్లుగా, 2020 డిసెంబరులో 1544 కోట్ల డాలర్లుగా నమోదైంది. 

* ఔషధ, ఇంజినీరింగ్‌ ఎగుమతులు వరుసగా 16.4 శాతం (200 కోట్ల డాలర్లు), 19 శాతం (740 కోట్ల డాలర్లు) చొప్పున పెరిగాయి.
* చమురు, ముడిఇనుము, పొగాకు, బియ్యం, పండ్లు, కూరగాయలు, కార్పెట్లు, హస్తకళలు, మసాలాలు, టీ, జీడిపప్పు, ప్లాస్టిక్, రసాయనాల రంగాలు సైతం వృద్ధి సాధించాయి.

* పెట్రోలియం ఉత్పత్తులు (-32 శాతం), రెడీమేడ్‌ దుస్తులు (-10.73 శాతం), తోళ్లు (-18.6 శాతం) ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 
* పసిడి దిగుమతులు 155 శాతం పెరిగి 400 కోట్ల డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు 1301 కోట్ల డాలర్ల నుంచి 27.72 శాతం తగ్గి 940 కోట్ల డాలర్లకు చేరాయి. 

ఇవీ చదవండి..

పెట్టుబడికి బంగారు బాట

ఐటీ నియామకాలు పెరుగుతాయ్‌

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని